నేటి నుండి వైజాగ్, విజ‌య‌వాడ‌ల్లో మంచిరోజులొచ్చాయి గ్రాండ్ స‌క్సెస్ టూర్

492

స్టార్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కించిన మంచిరోజులొచ్చాయి చిత్రం దీపావ‌ళి కానుక‌గా విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌దర్శింపబడుతోంది. ఈ స‌క్సెస్ ని ప్రేక్ష‌కుల‌తో స్వయంగా పంచుకోవ‌డానికి చిత్ర ద‌ర్శ‌కుడు మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్, హీరో సంతోష్ శోభ‌న్, హీరోయిన్ మెహ‌రిన్, క‌మీడియన్లు ప్ర‌వీణ్, సుద‌ర్శ‌న్ త‌దిత‌ర‌లు వైజాగ్, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, ఏలూరు, విజ‌య‌వాడ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సెంటర్స్ లో ఉన్న మంచిరోజులొచ్చాయి చిత్రం ప్ర‌ద‌ర్శింప‌బ‌తున్న థియేట‌ర్స్ కు వెళ్లి సినీ అభిమానుల్ని క‌ల‌వ‌నున్నారు. అంతేకాదు వైజాగ్, విజ‌య‌వాడ‌ల్లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ స‌క్సెస్ మీట్స్ కూడా జ‌ర‌గనున్న‌ట్లుగా చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ తెలిపారు.