‘పెళ్లెప్పుడు’ సినిమా అక్టోబర్ 6 న విడుదల

113

శ్రీ సాయి సై౦దవి క్రియేషన్స్ పతాకం లో రమప్రభ, వినయ్ ప్రసాద్ , అరవింద్ లు నటించిన చిత్రం ‘పెళ్లెప్పుడు’. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈరోజు ఫిలిం ఛాంబర్ లో విడుదల అయింది. అక్టోబర్ 6న విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత పాండురంగారావు మాట్లాడుతూ “మా ‘పెళ్లెప్పుడు’ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఈరోజు మా ట్రైలర్ ని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. గణేష్ గారు మా సినిమా చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 6న విడుదల చేస్తున్నారు” అని తెలిపారు.

డైరెక్టర్ ఏ.ఇరదయ రాజ్ మాట్లాడుతూ “ఈ సినిమా కథ మొత్తం యూత్ కోసం తీయడం జరిగింది, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది, అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నాం. మా చిత్ర ట్రైలర్ చూసి నిర్మాత ప్రసన్న కుమార్ గారు మా చిత్రాన్ని కొనియాడారు. మీ అందరికీ మా సినిమా నచ్చుతుంది” అని తెలిపారు

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “కన్నడ నుంచి వచ్చిన “కాంతరా” సినిమా ఎలా హిట్ అయిందో మనకు తెలుసు, అలాగే ఈ పెళ్లెప్పుడు సినిమా కూడా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ “కాలేజీ స్టూడెంట్ మీద తీసిన యదార్థ కథ ఇది, డైరెక్టర్ సినిమా చాలా బాగా తీశారు, టీం అందరికీ శుభాకాంక్షలు” తెలిపారు.

లైన్ ప్రొడ్యూసర్ చలపతి మాట్లాడుతూ “మా చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ గౌరవం ఇప్పుడు జనరేషన్ వారికి లేదు, యువత ఎలా ఉండాలి అని మంచి సందేశం తో తీసిన ఈ చిత్రం అక్టోబర్ 6 న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ మాట్లాడుతూ “ఈ సినిమా అన్ని మంచి సెంటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, మా ప్రొడ్యూసర్ గారికి మిగిలిన టీం అందరికీ ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో రాజశేఖర్, మగేంద్ర లు పాల్గొన్నారు.


Pavan Kumar

9849128215

Film Reporter