.టి ఎంట‌ర్ టైస్.ఆర్ న్మెంట్స్ఎప్రొడ‌క్ష‌న్ నెం 6 కోసం కాస్టింగ్ కాల్

520


ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో, సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి నిర్మాత‌గా కొత్త చిత్రం ప్రారంభం అవ్వ‌నుంది. ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం 6గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి అశ్వ‌ధామ ఫేమ్ ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దేశరాజ్‌ సాయితేజ్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి సినిమా‌కు స్టోరీలు అందిచారు. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమా కోసం అవ‌ర‌స‌మైన కీల‌క న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకోవ‌డానికి కాస్టింగ్ కాల్ ని ఎనౌన్స్ చేశారు. సినిమాల్లోకి రావ‌ల‌నే ప్ర‌తిభ‌ ఉన్న ఔత్సాహికుల‌కు త‌మ ప్రొడ‌క్ష‌న్ నెం.6 చిత్రంలో అవ‌కాశం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి ప్ర‌క‌టిస్తూ కాస్టింగ్ కాల్ కి సంబంధించి వివరాల‌తో ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లవ్వ‌నుందని రామ్ త‌ళ్లూరి తెలిపారు.

బ్యానర్ – ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్
స‌మ‌ర్ప‌ణ – సాయిరిషిక‌
నిర్మాత – రామ్ త‌ళ్లూరి, ర‌జ‌నీ త‌ళ్లూరి
క‌థ, క‌థ‌నం – దేశ్ రాజ్ సాయితేజ్
ద‌ర్శ‌కుడు – ర‌మ‌ణ తేజ‌
…………………………………………………………