ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య నిర్మిస్తోన్న చిత్రం `ఊరికి ఉత్త‌రాన‌`

283

ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య నిర్మిస్తోన్న చిత్రం `ఊరికి ఉత్త‌రాన‌`. న‌రేన్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్నాడు. దీపాలి శర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. స‌తీష్ అండ్ టీమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌రంగ‌ల్ లో జ‌రిగిన ఓ య‌థార్థ సంఘ‌ట‌నకు ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 19న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత వ‌న‌ప‌ర్తి వెంకటయ్య మాట్లాడుతూ…“ మా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే విడుద‌లైన మా చిత్రంలోని రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. పాట‌లకు , టీజ‌ర్ కు మంచి వ్యూస్ వ‌చ్చాయి. మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి,అంకిత్ కొయ్య, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌; సంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి; సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి; పీఆర్వోః వంశీ-శేఖ‌ర్‌; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మాల్యా కందుకూరి ; కో-ప్రొడ్యూస‌ర్ః రాచాల యుగంధర్ ; నిర్మాతః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ అండ్ టీమ్ .

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385