`హిట్` మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన దిల్‌రాజు

477

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా….

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ముందుగా నాని గురించి చెప్పుకోవాలి. త‌ను హీరోగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నిర్మాత‌గా మారి తొలి చిత్రంగా అ! వంటి డిఫ‌రెంట్ మూవీని అందించాడు. ఇప్పుడు హిట్ లాంటి మ‌రో సినిమాను కూడా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాడు. తన గ‌ట్స్‌కి అభినంద‌న‌లు. ఇలాగే ఎక్స్‌పెరిమెంట్స్ సినిమాల‌ను త‌ను ప్రొడ్యూస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. మ‌న‌లోని టేస్ట్‌ను ఇలాంటి సినిమాలతోనే బ‌య‌ట‌కు తీసుకు రాగ‌లుగుతాం. నిర్మాత‌లు నాని, ప్ర‌శాంతిగారికి అభినంద‌న‌లు.అన్నారు.

హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ – “సాధార‌ణంగా ఓ సినిమా హిట్ అయితే నెక్ట్స్ మూవీ ఏంట‌నేది ఓ టెన్ష‌న్ ఉంటుంది. శైలేష్ ఈ సినిమా క‌థ చెప్ప‌గానే మ‌రేం ఆలోచించ‌కుండా సినిమా చేయ‌కుండా ఓకే చేసేశాను. త‌ను నెరేట్ చేసేట‌ప్పుడే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఎంజాయ్ చేశాను. ప్ర‌తి సినిమాకు ఏదో ఒక టెన్ష‌న్ ఉండేది. యాక్టింగ్‌తో పాటు సినిమాలో మ‌రో ఎక్స్‌ట్రా వ‌ర్క్ చేసేవాడిని. కానీ.. హిట్ సినిమా విషయానికి వ‌స్తే.. యాక్టింగ్ త‌ప్ప మ‌రేమీ చేయ‌లేదు. ఎందుకంటే నాకు శైలేష్ మీద అంత న‌మ్మ‌కం ఉండింది.అన్నారు.

డైరెక్ట‌ర్ శైలేంద్ర మాట్లాడుతూ – “ట్రైల‌ర్ మీ అంద‌రికీ న‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. థ్రిల్ల‌ర్ మూవీ. ట్రైల‌ర్‌లో చూసిన దానికంటే సినిమాలో ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. ఫ‌స్ట్ నుండి లాస్ట్ వ‌ర‌కు ఆడియ‌న్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చునిపెట్టే థ్రిల్ల‌ర్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు నానిగారికి, ప్ర‌శాంతిగారికి, మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌“ అన్నారు.

నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని మాట్లాడుతూ – “విన‌గానే స్క్రిప్ట్ న‌చ్చింది. దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ముఖ్యంగా కంటెంట్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుందనే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

హీరోయిన్ రుహానీశ‌ర్మ మాట్లాడుతూ – “మాకు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌. ట్రైల‌ర్‌లో మీరు చూసిన దానిక‌న్నా సినిమాలో ఇంకా ఎక్కువ థ్రిల్ ఉంటుంది. విశ్వ‌క్‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీ. నాని, ప్ర‌శాంతిగారికి ప‌నిచేయ‌డం సంతోషంగా అనిపించింది“ అన్నారు.

న‌టీన‌టులు:
విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను
స‌మ‌ర్ప‌ణ‌: నాని
నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని
మ్యూజిక్‌: వివేక్‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)
స్టంట్స్‌: న‌భా
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా