ఆకాష్ కు రొమాంటిక్ ఒక ఇడియట్ లాంటి సినిమా అవుతుంది – పూరి జగన్నాథ్.

262

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. సినిమా చాలా బాగుంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. ఈ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకాష్ మంచి నటుడు అని రాజమౌళి కూడా చెప్పారు. నిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు.

ఛార్మీ మాట్లాడుతూ.. ‘సినిమా ఇంత బాగుంటుందా? ఇంత భారీ ఎత్తున తీశారా? అని అందరూ అన్నారు. లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ మరిచిపోయి క్లైమాక్స్‌ను చూస్తారు. మా చిత్రయూనిట్ ఎంతో కష్టపడటం వల్లే రొమాంటిక్ సినిమా ఇంత బాగా వచ్చింది.

కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘ఆకాష్ గురించి ఫిర్యాదులు ఏమీ లేవు. ఆయన నటనకు మ్యాచ్ అయ్యేలా పని చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా కోసం డైలాగ్స్ చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. రేపు థియేటర్స్ లోనే సినిమా చూడండి’ అని అన్నారు.

అనిల్ పాదురి మాట్లాడుతూ.. ‘ఆకాష్ వయస్సుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీయడమే నాకు పెద్ద చాలెంజ్. వీఎఫ్ఎక్స్‌లో పని చేశాను. గోవాను ఇంత వరకు చూడని లొకేషన్స్ చూపించాలని అనుకున్నాను. రమ్యకృష్ణ గారు అయితే పాత్ర బాగుంటుందని అనుకున్నాం. అనుకున్నట్టుగానే రమ్యకృష్ణ గారు బ్యాక్ బోన్ అయ్యారు’ అని అన్నారు.

ఆకాష్ మాట్లాడుతూ.. ‘నాన్న గారి డైలాగ్స్ చెప్పాలని నాకు ఇష్టమే. ఈ చిత్రంలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ రోజూ ఏదో ఒకటి నేర్చుకున్నాను. ఈ పాత్ర చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఇది కచ్చితంగా బాగా చేయాలని ఫిక్స్ అయ్యాను. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’ అని అన్నారు.