HomeTeluguడి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్

డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్

డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై హాస్య నటుడు గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ మరియు ఆయుషి హీరో హీరోయిన్ గా డి ఎస్ రాథోడ్ దర్శకత్వం లో వస్తున్నా ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఈ రోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. తనికెళ్ళ భరణి మరియు కె ఎస్ రవి కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. పూజ కార్యక్రమం అనంతరం హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గారు క్లాప్ ఇవ్వగా, కె ఎస్ రవి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

అనంతరం పాత్రికేయులతో దర్శక నిర్మాత డి ఎస్ రాథోడ్ మాట్లాడుతూ “మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిధులు గౌతమ్ రాజు గారికి, తనికెళ్ళ భరణి గారికి మరియు కె ఎస్ రవి కుమార్ గార్లకి నా ధన్యవాదాలు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా మదర్ సెంటిమెంట్ సినిమా. కథ చాలా బాగా వచ్చింది. గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ గారి నటన చూసి టాలెంట్ చూసి మా సినిమా సరిపోతాడు అని వారిని హీరోగా పెట్టుకున్నాము. నవంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. తాండూరు లో మొదటి షెడ్యూల్ ప్రారంభించి రెండో షెడ్యూల్ నవంబర్ చివరి వారం లో హైదరాబాద్ లో జరుపుకుంటాము. పాటల కోసం బ్యాంకాక్ వెళ్తున్నాం. మిగతా వివరాలు త్వరలోనే తెలియచేస్తాం” అని తెలిపారు.

హీరోయిన్ ఆయుషి మాట్లాడుతూ “నాకు ఈ సినిమా అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ డి ఎస్ రాథోడ్ గారికి ధన్యవాదాలు. కథ విన్నాను చాలా బాగుంది. మీ అందరికి నచుతుంది అని నమ్ముతున్నాను” అని తెలిపారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ “మా సినిమా ఓపెనింగ్ కి విచ్చేసిన తనికెళ్ళ భరణి గారికి, కె ఎస్ రవి కుమార్ గారికి, కోట శంకర్ రావు గారికి మరియు మీడియా వారికీ ధన్యవాదాలు. మంచి మదర్ సెంటిమెంట్ తో వస్తున్నా సినిమా. కథ బాగా వచ్చింది. నాకు ఇంత మంచి సినిమా లో అవకాశం ఇచ్చిన డి ఎస్ రాథోడ్ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

గౌతమ్ రాజు గారు మాట్లాడుతూ “దసరా రోజు మా అబ్బాయి సినిమా ప్రారంభం కావటం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా ఓపెనింగ్ కి విచ్చేసిన తనికెళ్ళ భరణి గారికి, కె ఎస్ రవి కుమార్ గారికి, కోట శంకర్ రావు గారికి మరియు మీడియా వారికీ ధన్యవాదాలు.మన తెలుగు సినిమా చరిత్రలో మదర్ సెంటిమెంట్ తో వచ్చే ప్రతి సినిమా హిట్. ఈ సినిమా కూడా మదర్ సెంటిమెంట్ తో వచ్చే సినిమా కానీ చాలా డిఫరెంట్ కథ తో వస్తున్నారు. మంచి హిట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు

బ్యానర్ : డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్

స్టోరీ, స్క్రీన్ ప్లే. డైరెక్షన్ : డి ఎస్ రాథోడ్

మాటలు : నరేంద్ర జి కుమార్

కెమెరా మాన్ : పి ఎస్ కర్ణ

సంగీతం : సత్య కశ్యప్

ఎడిటర్ : సంపత్

కో డైరెక్టర్ : జశ్వంత్ విజయ్ సాయి

కొరియోగ్రాఫర్ : హరి మాస్టర్

అసోసియేట్ డైరెక్టర్ : ఆర్తీ శర్మ

పి ఆర్ ఓ : వాసు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES