విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌లో డా.కె.సోమశేఖర్‌

144


నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమయ్యే పదిమందికి అండగా ఉండే డా.కె.సోమశేఖర్‌ను విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌ వరించింది. ఇటీవల జరిగిన డాక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌లో సేవ్‌ ద లివర్‌ ఫౌండేషన్‌ ద్వారా 125కు పైగా అవగాహనా సదస్సులు మరియు ఉచిత హెపటైటిస్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ క్యాంపులు నిర్వహించి ఎంతోమంది పేదలకు అండగా నిలిచిన సోమశేఖర్‌రావును రిటైర్డ్‌ హైకోర్ట్‌ జడ్జి బి.చంద్రకుమార్‌ సన్మానించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కృష్ణాజిల్లాలో రెండు కొవిడ్‌ క్లినిక్‌లు నిర్వహించి పేదలకు అండగా నిలిచిన సోమశేఖర్‌రావును, ఆయన చేసిన సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌ ఇచ్చి సన్మానించింది.