హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఆవిరి`. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ..
దిల్‌రాజు మాట్లాడుతూ – “కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్. ఈ రెండు జోనర్స్‌లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్‌డూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో అసోసియేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న `ఆవిరి` ప్రేక్షకులను మెప్పించే చిత్రమవుతుంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం“ అన్నారు.
దర్శక నిర్మాత రవిబాబు మాట్లాడుతూ – “దిల్‌రాజుతో కలిసి ఓ సినిమా చేయాలని 15 సంవత్సరాలుగా అనుకుంటున్నాను. కానీ కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. `ఆవిరి` సినిమాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
నటీనటులు:
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ తదితరులు
సాంకేతిక వర్గం:
ఆర్ట్: నారాయణ రెడ్డి
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
యాక్షన్: సతీశ్
కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి
మ్యూజిక్: వైధి
స్క్రీన్‌ప్లే: సత్యానంద్
రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు