నా పేరు రాజా` షూటింగ్ పూర్తి

533

అమోఘ్ ఎంటర్ ప్రైజెస్ పతాకం పై రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా “తిరుగుబోతు ” చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరో గా పరిచయమైన యాక్షన్ స్టార్ రాజ్ సూర్యన్ హీరోగా ఈ సారీ మూడు డైనమిక్ మరియు డిఫరెంట్ పాత్రలు , గెటప్ లతో వస్తోన్న చిత్రం ` నా పేరు రాజా`. `ఈడో రకం… డెఫినెట్లీ డిఫరెంట్` అనేది టాగ్ లైన్. ఇక ఇందులో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆకర్షిక మరియు హాట్ మోడల్ నస్రీన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ చిత్రం ద్వారా ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్ సూపర్ మోడల్ అవ సఫాయి, ఆరాధ్య నటీ నటులుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…“ ఆంధ్ర-తెలంగాణ, కేరళ , కర్ణాటక లో దాదాపు 65 రోజుల లో షూటింగ్ పూర్తి చేసాము. ఇక ఇందులో సెన్సేషనల్ టైటిల్ సాంగ్ “రాజా రాజా మన్మధ రాజా ..ఆజా ఆజా నా రాజా “ సాంగ్ ను కొరియోగ్రాఫర్ నగేష్ హాలీవుడ్ స్టైల్ లో చిత్రీకరించారు. సాహితీ రాసిన ఈ పాటను మోహనా భోగరాజు పాడారు. కంటెంట్ నచ్చి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాం. ఇక అక్టోబర్ లో ఆడియో రిలీజ్ చేసి సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
ప్ర‌భు సూర్య‌, ఆయుశ్రీ, ఇరాన్ , సూప‌ర్ మోడ‌ల్ అవా స‌ఫాయి, ఆరాధ్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్ః ఎ.వెంక‌ట్; ఎడిట‌ర్ః వెంకీ యుడివి; ఫైట్స్ః థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మద‌; కొరియోగ్రాఫ‌ర్ః న‌గేష్‌.వి; లిరిక్స్ః శ్రీమ‌ణి, సాహితి; నిర్మాత‌లుః రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి; ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వంః అశ్విన్ కృష్ణ‌.