మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు – యాంగ్రీ హీరో కార్తీ

516


యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌ సాధిస్తోన్న ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కి థాంక్స్ చెప్పిన యాంగ్రీ హీరో కార్తి
యాంగ్రీ హీరో కార్తి మాట్లాడుతూ – “ఖైదీ’ చిత్రం పట్ల మీరు చూపించే ప్రేమ, మీరు అందించిన ప్రశంసలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియ‌డం లేదు. ఒక ఎగ్జైటింగ్ స్టోరీని మీకు అందించాలనే లక్ష్యంతో నేను మా టీమ్ మనసు పెట్టి హార్డ్ వర్క్ చేశాం. కానీ మేము ఈ స్థాయిలో రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా చిత్రాన్ని చూసి అభినందించిన మహేష్ బాబు గారికి థాంక్స్. తన ప్రశంసలతో టీమ్ అంతా థ్రిల్ అయ్యారు. ఈ సినిమాని అభినందిస్తూ అందరిలోకీ తీసుకెళ్ళిన మీడియా వారికి ధన్యవాదాలు. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు. ” అన్నారు.

విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తూ యాంగ్రీ హీరో కార్తి లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని సమర్పకులు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ అన్నారు.