సాచీ క్రియేషన్స్ పతాకం పై స్నేహా రాకేశ్ నిర్మాతగా, నూతన దర్శకుడు శేష్ కార్తీకేయ తెరకెక్కిస్తున్న చిత్ర అశ్మీ. పూర్తిగా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో థ్లిలర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు. అశ్మీ అనే టైటిల్ తో అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు సాధరణ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. ఇప్పటికే విడుదలైన పబ్లిసిటి కంటెంట్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అశ్మి చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ వినూత్నమైన థ్రిల్లింగ్ పాయింట్ ని తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అశ్మీ చిత్రం ఆకట్టుకునే రీతిన ఈ సినిమాను దర్శకుడు శేష్ కార్తికేయ రెడీ చేశారనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత స్నేహా రాకేశ్ మాట్లాడుతూ దర్శకుడు శేష్ కార్తీకేయ, ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి ఎజ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ వచ్చేలా అత్యంత ఉత్కంఠ భరితంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దినట్లుగా తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నీ ఈ సినిమా విడుదలకి సిద్ధం ఉంది. మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నాయి
నటీనటులు
రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్
సాంకేతిక వర్గం
బ్యానర్ – సాచీ క్రియేషన్స్
నిర్మాత – స్నేహా రాకేశ్
రచన – దర్శకత్వం, సినిమాటోగ్రఫి – శేష్ కార్తీకేయ
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – శాండీ అద్దంకి
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్