స్లమ్ బ్యాక్ డ్రాప్ లో చిన్న పిల్లలు (మాస్టర్ ఇషాన్, మాస్టర్ ప్రీతమ్ యువరాజ్, నిహీర, శ్రీవల్లి, తుల్య) భామ్మ (ప్రమీల రాణి) ఆకాశవాణి ప్రభు, కథ ఆధారంగా యువ దర్శకుడు యల్కోటి విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ధర్మహ, ఈ చిత్రం సెకండ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, వైపిబిఆర్ ఆర్ట్స్ మరియు శ్రీ పరిగెల సద్గురు రాణి ప్రెజెంట్స్ తో ప్రశాంత్ కుమార్ పరిగెల,చిప్పగిరి సతీష్ కుమార్ , శ్రీధర్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దర్శకుడు యల్కోటి విజయ్ కుమార్ మరియు చిత్ర నిర్మాతలు ప్రశాంత్ కుమార్ పరిగెల, చిప్పగిరి సతీష్ కుమార్, శ్రీధర్ మరియు చిత్ర బృందం తెలంగాణ సినిమాటోగ్రఫి మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ను కలిశారు. తక్కువ వయసు ఉన్న పిల్లలతో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేలా యువ దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆధరించేలా ఈ సినిమా ఉండబోతొంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫి మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ… యువ దర్శకుడు యల్కోటి విజయ్ కుమార్ తీసుకున్న పాయింట్ చాల బావుంది మంచి సందేశాత్మక చిత్రాన్ని ఎంచుకున్నాడు.ఈ చిత్రం తో సొసైటికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు.తీసిన కొంతబాగం నాకు చూపెట్టడం జరిగింది. చిన్న పిల్లలతో మంచి ప్రయత్నం చేసాడు.తను పడ్డ కష్టం నాకు కనిపించింది..ఇలాంటి యంగ్ మేకర్స్ కి నా సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది.. అలాగే ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ కుమార్ , సతీష్ ,శ్రీదర్ కొత్తవాళ్లైనా చాల బాగా తీసారు.అందరికి ఆల్ ద బెస్ట్…
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ పరిగేల ప్రశాంత్ కుమార్ ,సతీష్ మాట్లాడుతూ… మేము వెళ్లి అడగ్గానే మా పోస్టర్ రిలీజ్ చేసి నందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి థాంక్స్.అలాగే వారి కుమారుడు సాయి కిరణ్ యాదవ్ గారికి కుడా థాంక్స్..దర్శకుడు మాకు కథని చెప్పిన విదంగా అద్బుతంగా తెరకెక్కించాడు. ఇది డైరెక్టర్ కు మరియు మాకు మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము. తొందరలో రిలీజ్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు యల్కోటి విజయ్ కుమార్ మాట్లాడుతూ… మా యొక్క మూవీ సెకండ్ లుక్ రిలీస్ చేసినందుకు మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వెరీ థాంక్స్.. అలాగే ఈ కథను ,నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్స్ కి కూడా చాలా థాంక్స్.. కెమరామెన్ నరసింహ కట్ట గారికి కూడా చాల థాంక్స్…ఇండస్ట్రీ లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది ఆ సపోర్ట్ లేకుంటే ఇక్కడివరకు వచ్చేవాన్నే కాదు.. థాంక్స్ టు మై ఫ్యామిలీ.. ప్రొడ్యుసర్ ప్రశాంత్ గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.త్వరలో రిలీజ్ కు ప్రయత్నాలు చేస్తున్నాం.
నటీనటులు:
మాస్టర్ ప్రీతమ్ యువరాజ్, మాస్టర్ ఇషాన్, తుల్య, ప్రమీల రాణి,ఆకాశవాణి ప్రభు, వినోద్, శ్రీను మామ, వీరేంద్ర గిడ్డ,
బేబీ నిహిర,బేబీ శ్రీవల్లి..
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: యల్కోటి విజయ్ కుమార్
కెమెరామెన్: నరసింహ కట్ట
ఎడిటింగ్: kcb హరి
మ్యూజిక్: కృష్ణ సౌరబ్
కో-డైరెక్టర్-శరన్ వేదుల
నిర్మాతలు: ప్రశాంత్ కుమార్ పరిగెల, సతీష్ కుమార్ , శ్రీధర్
పీఆర్ఒ: ఫ్రీడమ్ మీడియా