డిగ్రీ కాలేజ్ ప్రి రిలీజ్ వేడుక

551


శ్రీ లక్ష్మీ నరశీంహ సినిమా పతాకంపై వరుణ్, దివ్య రావు జంటగా నరశింహనంది స్వీయ దర్శకత్వం లో రూపొందించిన చిత్రం డిగ్రీ కాలేజ్.ఈ నెల 7 న ఈ చిత్రం విడుదల అవుతుంది. కాగా డిగ్రీకాలేజ్ ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ,నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ లు ముక్యా అతిధులు గా వచ్చి ఈ చిత్రము యోక్క ట్రైలర్ ను లాంచ్ చేసారు.

తమ్మ రెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ …ఈ చిత్ర ట్రైలర్స్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.దర్శకుడు యూత్ ని ఆకర్షించే సీన్స్ బయటపెట్టి అసలు కథను దాచిపెట్టాడు.సినిమాలో కంటెంట్ ఉంటే 100 రోజులైనా ఆడుతుంది.అలాంటి కంటెంట్ ను నమ్ముకొని తీస్తున్న నరసింహనంది కి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అన్నారు..

దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ –ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసి 6 నెలలు అయింది.ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది, ఈ ట్రైలర్ చూసినా తరువాత చాలామంది ఈ నరసింహనంది ఎవ్వరిని గూగుల్ లో సెర్చ్ చేశారు. “1940′ అనే సినిమా తీసి జాతీయ అవార్డు,నంది అవార్డ్ తెచ్చుకున్న దర్శకుడైన మీరు ఎందుకు ఇలాంటి సినిమా తీశారని చాలా డిబేట్స్ లో ఛానెల్స్ వారు అడిగారు. అయితే ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇందులోబలమైన కథ ఉంది, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కి నిజజీవితం లో జరిగిన యదార్థ సంఘటన

ఈ నెల 7 న విడుదల విడుదల చేస్తున్నాము.ఈ సినిమాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా.నాకు సహకరించిన ,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సహా నిర్మాత అలేటి శ్రీనివాసరావు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు

ఆర్టిస్ట్స్ : హీరో-వరుణ్ హీరోయిన్-దివ్య రావు, దువ్వాసి మోహన్, జయవాని, ఆర్.కె, రవిరెడ్డి, అనిల్ మైవిలేజ్ షో, మదన్, శ్రీనివాస్, సలీం, మల్లేశ్ తెల్జేరి, చంద్రముఖి మువ్వల, యోగి భూచేపల్లి, వీర భద్రమ్.

సాంకేతిక నిపుణులు

సాహిత్యం-వనమాలి
సంగీత-సునీల్ కశ్యప్
D.O.P- S. మురళి మోహన్ రెడ్డి
ఆర్ట్స్-బాబ్జి. ఎడిటింగ్-వ్.నాగిరెడ్డి

కో-డైరెక్టర్-ఆర్.జాననికుమార్ రెడ్డి, దుద్దు గుంట మహేందర్‌రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్స్ -కె .కిషన్, బద్దల హరిబాబు, రవి,ఎ. పుల్లయ్య

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్-ఎండి.సలీమ్, మల్లెష్ తెల్జేరి, పి.సుధాకర్ (లడ్డు), కొడుకు కనకయ్య.

అసోసియేట్ నిర్మాతలు-శ్రీలం శ్రీనివాస్ రెడ్డి

సహ నిర్మాతలు-ఆలేటి శ్రీనివాస్ రావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డి

నిర్మాత-శ్రీ లక్ష్మి నరసింహ సినిమా

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నరశింహ నంది