HomeTelugu'యానిమల్' లాంటి ఇంటెన్స్ కంటెంట్ తో 'దీనమ్మ జీవితం' తప్పకుండా అందరినీ అలరిస్తుంది: ప్రీ రిలీజ్...

‘యానిమల్’ లాంటి ఇంటెన్స్ కంటెంట్ తో ‘దీనమ్మ జీవితం’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది: ప్రీ రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రలలో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై. మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి సోనియా నిర్మించారు. జనవరి 5న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది.

ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ‘ప్రేమ పిపాసి’ని చాల కసిగా చేశాను. ప్రేమని వెతుక్కునే కుర్రాడి కథ అది. సినిమాకి చాలా మంచి క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డిలా వుందని ప్రశంసలు వచ్చాయి. అయితే సరిగ్గా విడుదలైన సమయానికి కరోనా లాక్ డౌన్ వచ్చింది. అప్పుడే దీనమ్మ జీవితం అనిపించింది. అయితే నాకు తెలిసింది సినిమానే. ఎలాగైనా మళ్ళీ సినిమా చేయాలని సంకల్పించుకున్నాను. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రం లాంటి రా ఫ్యామిలీ సినిమా ‘దీనమ్మ జీవితం’. చాలా డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. మలయాళం, తమిళ్ పరిశ్రమలే కాదు తెలుగులో కంటెంట్ తో సినిమా చెప్పగలరని నిరూపించే చిత్ర దీనమ్మ జీవితం. ఈ సినిమా కోసం నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. దేవ్ అద్భుతంగా నటించాడు. నటీనటులంతా చక్కని ప్రతిభ కనపరిచారు. చాలా మంచి టెక్నికల్ టీం పని చేసింది. జనవరి 5న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఆదరించాలి’ అని కోరారు

దేవ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం టీం అంతా చాలా శ్రమించాం. ముఖ్యంగా దర్శకుడు మురళి రామస్వామి నన్ను చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో నటీనటులంతా మంచి నటన కనబరిచారు. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఈ సినిమా వారికి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. ఖచ్చితంగా పెద్ద విజయాన్ని అందుకుంటుదనే నమ్మకం వుంది’ అన్నారు

ప్రియ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో భాగం కావడం చాలా అనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు మురళి రామస్వామిగారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. అందరూ సినిమా చూసి బ్లెస్ చేయాలి” అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

నటీనటులు: దేవ్, ప్రియ చౌహాన్, సరిత..తదితరులు

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: మురళి రామస్వామి
నిర్మాతలు: వై. మురళి కృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా
డీవోపీ: సతీష్
సంగీతం: ఆర్ ఎస్
ఎడిటర్ : జానీ బాష
ప్రొడక్షన్ డిజైన్: రామస్వామి పండు
పి.ఆర్.వో: తేజస్వి సజ్జా

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES