HomeTelugu*పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘డిసెంబర్ 18’*

*పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘డిసెంబర్ 18’*

మహా ఆది కళాక్షేత్రం పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రంగా తెరకెక్కనున్న ‘డిసెంబర్ 18’ చిత్రం నేడు(గురువారం) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బ్రహ్మాజీ పోలోజు కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అందించనున్న ఈ చిత్రాన్ని బి. రాజేష్ గౌడ్ నిర్మించనున్నారు. ‘సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. తెలుగు సినీ రచయితల సంఘం ట్రెజరర్ చిలకమర్రి నటరాజ గోపాలకృష్ణ చిత్రయూనిట్‌కు స్క్రిప్ట్‌ని అందించారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇదొక థ్రిల్లర్ చిత్రం. సరికొత్తగా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్ర్కీన్‌ప్లేతో ఈ చిత్రం రూపొందనుంది. నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. రెగ్యులర్ షూటింగ్ జనవరి మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు. కాగా, చెన్నపరెడ్డి, కృష్ణారెడ్డి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్: సుధాకర్ విశ్వనాధుని, పి.ఆర్.ఓ: బి.ఎస్. వీరబాబు, నిర్మాత: బి. రాజేష్ గౌడ్, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: బ్రహ్మాజీ పోలోజు.

#MahaAadiKalaKshetram Banner Production No 2 Film #December18 Launched
Directed by #BrahmajiPoloju
Produced by #RajeshGoudB
Pro @veerababupro

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES