విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని పాటలను లైవ్‌గా పదర్శించడమే కాకుండా, విజయ్ దేవరకొండ, రష్మిక స్టేజ్‌పై పాటలకు డ్యాన్సులు చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్బంగా..
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “మనంందరిలో చాలా భయాలుంటాయి. అయితే వాటిని వదిలేస్తేనే మనం గెలుస్తాం. నేను కూడా నటుడు కావాలనుకన్నప్పుడు భయమేసింది. మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అది మనకు దక్కుతుంది. ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నమే `డియర్ కామ్రేడ్` సినిమా. బెంగళూరు, కొచ్చి, చెన్నైల్లో ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్స్ చేశాం. ప్రేక్షకులు ప్రతిచోటా మాకు ప్రేమనే పంచారు. ఇంత ప్రేమకు థ్యాంక్స్ చెబితే సరిపోతుందా? అనిపించింది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. దక్షిణాది భాషల్లో చేసిన తొలి ప్రయత్నం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది“ అన్నారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ – “నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను. అయితే చాలా మంది వద్దనే అన్నారు. సినిమా రంగంశ్రేయస్కరం కాదని చెప్పారు. అయితే నేను ప్రేమించిన దాని కోసం కష్టపడ్డాను. అందరినీ ఒప్పించాను. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. అందరూ వారు ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలి“ అన్నారు.
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన `డియర్ కామ్రేడ్` మ్యూజిక్ ఫెస్టివల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం