ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు హారి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ సాయి కుమార్ చేతులు మీదుగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.
ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ…
కాలేజ్ కుమార్ సినిమాను ప్రతి తండ్రి కనెక్ట్ అవుతారు. నేను ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చెయ్యాల్సి ఉంది, కానీ కుదరలేదు, ఆ పాత్రను నా తమ్ముడు రవి చేసాడు, తనకు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. డైరెక్టర్ నాతో ఈ సినిమాను తెలుగులో చేస్తున్నాను అన్నప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యాను. విజయ్ మాస్టార్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి మరింత హ్యాపిగా ఫీల్ అయ్యాను. 6న ఈ సినిమా అందరూ చూసి ఆశీర్వదించండని తెలిపారు.
డైరెక్టర్ హరి సంతోష్ మాట్లాడుతూ…
మా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాయి కుమార్ గారికి ధన్యవాదాలు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది ఈ సినిమా, ఆడియన్స్ అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉండబోతోంది అనుకుంటున్నాను, ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ…
కాలేజ్ కుమార్ కుమార్ ట్రైలర్ అందరికి నచ్చినందుకు సంతోషంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ వారు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ప్రసాద్ గారితో నటించడం సంతోషంగా ఉంది, ఒక మంచి సబ్జెక్ట్ తో డైరెక్టర్ గారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కాలేజ్ కుమార్ అవుతుందని భవిస్తూ సెలవు తీసుకుంటున్న అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
రాహుల్ విజయ్ తన నటన ప్రతిభను చూపించాడు, సాయి కుమార్ నేను అద్భుతమైన స్నేహితులు ఈరోజు తాను కాలేజ్ కుమార్ ట్రైలర్ ను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. కన్నడలో పెద్ద సక్సెస్ ఆయిన ఈ సినిమా తెలుగులో కాలేజ్ కుమార్ పేరుతో విడుదలవ్వడం విశేషం. ఈ సినిమాలు మర్చిపోలేని పాత్రలో నటించాను, రాహుల్ విజయ్ నా కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమా ఈ సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. అన్నారు.
బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.
సమర్పణ: లక్ష్మణ గౌడ,
ప్రొడ్యూసర్: ఎల్. పద్మనాభ
డైరెక్టర్: హారి సంతోష్
డిఓపి: గురు ప్రశాంత్ రాజ్
మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప
ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్
స్టంట్స్: విజయ్
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
డైలాగ్స్: సందీప్ రాజ్
నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు