సిఎమ్‌బి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్ మోహన శివకుమార్ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం హెబ్బులి. ఎస్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చసుదీప్, అమలాపాల్ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియోని ఫిలిమ్ ఛాంబర్‌లో ఘనంగా పాత్రికేయుల సమావేశంలో విడుల చేశారు. చిత్ర ట్రైలర్‌ను సీ కళ్యాణ్ లాంచ్ చేయగా… మొదటి పాటను ప్రశన్నకుమార్ విడుదల చేయగా… తుమ్మల పల్లి సత్యనారాయణ రెండవ పాట విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో …
ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… కన్నడలో హెబ్బులి సూపర్ కలెక్షన్లు సాధించింది. కాబట్టి నేను కూడా ఓ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇక్కడ కొన్నాను. బాపిరాజు మాట్లాడుతూ విక్రాంత్ రోణా కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము. మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ… విక్రాంత్ రోణా కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము. మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
సీ.కళ్యాణ్ మాట్లాడుతూ… ఎక్కడో పుట్టి ఇండస్ట్రీలో కలిసి పదవులను ఎంజాయ్ చేస్తున్నాము. అలాంటిది పక్కవాళ్లకి సహాయం చేయాలి, సినిమాలు తీయాలి…డబ్బులు పోగొట్టుకోకూడదు. మూవీ కొన్నందుకు నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కన్నడలో హెబ్బులి సూపర్ కలెక్షన్లు సాధించింది. కాబట్టి నేను కూడా ఓ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇక్కడ కొన్నాను. బాపిరాజు మాట్లాడుతూ విక్రాంత్ రోణా కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము. మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ప్రశన్నకుమార్ మాట్లాడుతూ... ట్రైలర్, సాంగ్స్ చాలా రిచ్‌గా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. బాపిరాజుగారు నా సినిమా ఊ అంటావా మావా.. ఉ..ఊ.. అంటావా సినిమా 18న ఉండడంతో ఆయన ఒక వారం వెనక్కు తగ్గి 25కి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అన్నారు. ఈ సినిమాకి 12 నుంచి 15కోట్లు వరకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. పశ్చిమగోదావరిలో బాపిరాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యన్నారాయణ మాట్లాడుతూ బాపిరాజు మంచి ప్రొడ్యూసర్. విక్రాంత్ రోణాలానే ఇదికూడా మంచి చిత్రం అవ్వాలి. బాపిరాజు ఎంతో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్. ఆయనకు మంచి హిట్ రావాలని అలాగే కళ్యాణ్, ప్రసన్నకుమార్ ఎంతో హెల్పింగ్‌గా ఉంటారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. అప్పట్లో బాపిరాజుగారు నాకు పోటీగా చేసేవారు. అప్సటినుంచి ఆయనంటే నాకు చాలా గౌరవం. ఒక వారం తగ్గి తన సినిమాను రిలీజ్ చేయడంతోనే ఆయన ఎంత ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తోందో తెలుస్తోందన్నారు. డబ్బింగ్ అంటూ ఏమీలేదు…ఇప్పుడొచ్చేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఈ మూవీకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.
వి.రవిచంద్రన్, పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్ మరియు రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.