క్రిస్మస్ కానుకగా నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న సూపర్ హీరో ‘మిన్నల్ మురళి’

284


టోవినో థామస్ నటించిన మిన్నల్ మురళి చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న రాబోతోంది.

నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే మిన్నల్ మురళి. ఈ చిత్రాన్ని సోపియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.

చెడు మీద మంచి చేసిన యుద్దాన్ని మిన్నల్ మురళి చిత్రంలో చూడవచ్చు. అది కూడా కేవలం నెట్ ఫ్లిక్స్‌లోనే. డిసెంబర్ 24న ఈ మూవీ ప్రీమియర్ కాబోతోంది.

దర్శకుడు : బసిల్ జోసెఫ్
నటీనటులు : టోవినో థామస్, గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్
రచయిత, స్క్రీన్ ప్లే, మాటలు : అరున్ ఏ ఆర్, జస్టిన్ మాథ్యూస్
పాటలు : మను మంజిత్
సంగీతం : షాన్ రెహ్మాన్, సుశిన్ శ్యామ్

About Netflix:
(నెట్‌ఫ్లిక్స్‌ గురించి)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడింగ్‌ ఓటీటీ సంస్థల జాబితాలో ముందువరుసలో ఉన్న స్ట్రీమింగ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌. 190 దేశాల్లో 208 మిలియన్ల పెయిడ్‌ మెంబర్‌షిప్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. డాక్యూమెంటరీలు, టీవీ సిరీస్‌లు, ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇలా భిన్నరకాలైన వినోదాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తమ వ్యూయర్స్‌కు అందిస్తుంది. ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉన్న ఓ స్క్రీన్‌పై అయిన…ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులను పొందవచ్చు. లేటెస్ట్ న్యూస్, అప్డేట్స్, వినోదం కోసం IG @Netflix_IN, TW @NetflixIndia, TW South @Netflix_INSouth and FB @NetflixIndia వీటిని ఫాలో అవ్వండి.

About Weekend Blockbusters:
(వీకెండ్ బ్లాక్ బస్టర్స్ గురించి)
బెంగళూరు డేస్ సినిమాతో వీకెండ్ బ్లాక్ బస్టర్ బ్యానర్ ప్రయాణం మొదలైంది. 2014లో వచ్చిన ఈ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేసింది వీకెండ్ బ్లాక్ బస్టర్స్ సంస్థ. అలా మొదటి సినిమాతో వీకెండ్ బ్లాక్ బస్టర్స్ సంస్థ.. నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఆ చిత్రం మాలీవుడ్‌లో ఎప్పటికీ ఓ కల్ట్ సినిమాగా మిగిలిపోతుంది. ఇక కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2016లో తీసిన రెండో చిత్రం ‘కాదు పూక్కున్న నేరం’తో మరో హిట్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని డాక్టర్ బిజు తెరకెక్కించారు. ఇక మూడో చిత్రం మోహన్ లాల్ హీరోగా వచ్చిన మంతిరివల్లికల్ తాలిర్కుంబల్ అనే సినిమా కమర్షియల్ హిట్‌గా నిలచింది. ఈ చిత్రాన్ని జిబు జాకబ్ 2017లో తెరకెక్కించాడు. ఆ తరువాత 2108లో బిజూ మీనన్ హీరోగా పాదయోట్టం అంటూ ఓ కామెడీ సినిమాను నిర్మించింది. ఇక ఇప్పటి వరకు ఈ సంస్థ తెరకెక్కించిన చిత్రాల్లో మిన్నల్ మురళి అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇండియాలో చాలా భాషల్లో ఈ చిత్రం రాబోతోంది. దీని తరువాత నివిన్ పాలి హీరోగా బిస్మి స్పెషల్ అనే మరో చిత్రం రానుంది.