HomeTeluguభాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌


ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

న‌టీన‌టులు:
శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్, స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: వై.శ్రీనివాస‌రెడ్డి
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే: ప‌ర‌మ్ సూర్యాన్షు
మ్యూజిక్‌: సాకేత్ కొమండూరి
సినిమాటోగ్ర‌ఫీ: భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌
ఎడిట‌ర్‌: అవుల వెంక‌టేశ్
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: చిత్రం శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ధ‌నుంజ‌య కుమార్‌
ఎగ్జిక్యూష‌న్‌: నారాయ‌ణ జంప‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాక‌

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES