మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న “రుద్రాక్షపురం”..

609

మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  నాగమహేశ్, రాజేంద్ర, జీవ, సాయి మణితేజ, వైడూర్య, పవన్ వర్మ, సునిత,రేఖ,రాజేశ్ రెడ్డి,వీరబాబు,సురేష్ కొండేటి, ఆనంద్, అక్షర నిహా నటీనటులు గా ఆర్ కె గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గ రాజు లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం”రుద్రాక్షపురం”.విజయవంతంగా మూడవ షెడ్యూల్ పూర్తి చేసుకొని నాలుగవ షెడ్యూల్ కు అనంతపురం వెళుతున్న సందర్భంగా చిత్ర పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకుంది.ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లాడుతూ .. కన్నడలో 3 మూవీస్ చేశాను తెలుగులో ప్రేమ భిక్ష చేశాను. “రుద్రాక్షపురం” రెండవ చిత్రం.నిర్మాత ఉపేందర్ రెడ్డి గారికి కథ చెప్పగానే ఓకె చేశారు.ఇందులోసినిమా వాళ్ళ, కథలు,వ్యధలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఇండస్ట్రీ అంటే తపన వుండే వారికి అవకాశం ఇవ్వాలి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఒక పాట,ఫైట్  మిగిలి ఉంది.ఈ ఫైట్ ను థ్రిల్లర్ మంజు చేస్తున్నారు

నిర్మాత కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ.. గతంలో “బ్యాట్ లవర్స్” సినిమా చేశాను అది నెక్స్ట్ మంత్ విడుదల అవుతుంది , ఈ బ్యానర్ లో ఇది రెండవ సినిమా. సురేష్ కొండేటి గారిని అడగంగానే సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు.  ఆయనతో ఫైట్స్ కూడా చేయించాము. గాంధీ గారు “రుద్రాక్షపురం” కథ చెప్పినప్పుడు ఈ సినిమా కచ్చితంగా తీయాలని చేశాము.నాగమయి క్యారెక్టర్ సినిమాకు హైలెట్ అవుతుంది మిగిలిన నటీనటులు అందరు బాగా సహకరించారు  అన్నారు

చిత్ర హీరో నాగ మహేష్ మాట్లాడుతూ .. గతంలో “బ్యాట్ లవర్స్” సినిమా చేశాను ఈ “రుద్రాక్షపురం” రెండవ సినిమా.ఈ కథ చాలా అద్భుతంగా ఉంది.దర్శకుడు కథను టెక్నికల్ గా బాగా చేశారు. ఇందులో నాగమహేష్ , సురేష్ కొండేటి, వీరబాబు గార్లతో, పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

సినిమాలో డైరెక్టర్ గా నటించిన పి. ఆర్.ఓ వీరబాబు మాట్లాడుతూ .. డైరెక్టర్ గాంధీ గారి సినిమాకు గతంలో పి ఆర్.ఓ గా  చేశాను. ఆ రోజు తను నెక్స్ట్ చేసే సినిమాలో  నాకు మంచి క్యారెక్టర్ ఇస్తామన్నారు. ఈ సినిమా కథ రెడి చేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో దర్శకుడి పాత్ర లో నటించే అవకాశం ఇచ్చారు అందుకు ధన్యవాదాలు అన్నారు

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ అవకాశం ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో మాత్రమే ఆఫీస్ బాయ్ కూడా స్టార్ హీరో అయ్యే అవకాశం ఉన్నాయి. అందరికి అద్భుతమైన లైఫ్ ఇచ్చే కళామతల్లి సినీ పరిశ్రమ.నాకు ఈ సినిమా  కథ చెప్పడానికి వచ్చిన గాంధీ గారు కథ చెప్పగానే నచ్చింది. లొకేషన్ కి వెళ్ళేసరికి నాతో ఫైట్లు కూడా ప్లాన్ చేశారు నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పటివరకు నేను కొన్ని సినిమాల్లో నటించి నప్పటికీ ఫైట్స్ చెయ్యలేదు. 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అందరినీ దగ్గరనుండి చూశాను. ప్రొడ్యూసర్ గా కూడా నేను కొన్ని సినిమాలు చేసి ఉన్నాను. నాకు ఈ బ్యానర్ లో నటించడం చాలా కంఫర్ట్ అనిపించింది ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుతున్నాను

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
నాగమహేశ్,రాజేంద్ర,జీవ,సాయి మణితేజ,వైడూర్య,పవన్ వర్మ, సునిత,రేఖ,రాజేశ్ రెడ్డి, వీరబాబు, సురేష్ కొండేటి,ఆనంద్,అక్షర నిహా

సాంకేతిక నిపుణులు
బ్యానర్: మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు-కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గ రాజు
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం-ఆర్ కె గాంధీ
సంగీతం -సాహిత్యం:గంటాడి కృష్ణ,జయసూర్య
స్టంట్స్-త్రిల్లర్ మంజు,బాజి,స్టార్ మల్లి
నృత్యం-అన్నారాజ్
ఎడిటర- మల్లి ,శివ
ఛాయాగ్రహణం-నాగేంద్రకుమార్
పి ఆర్ ఓ.. వీరబాబు