‘బాలమిత్ర’కు వస్తోన్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉంది: దర్శకుడు శైలేష్ తివారి

364

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ నటీనటులుగా శైలేష్ తివారి దర్శకత్వంలో శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మించిన ‘బాలమిత్ర’ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్‌తో చిత్రయూనిట్ సంతోషంగా ఉన్నట్లుగా తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో తెలిపింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరిని థ్రిల్ చేసే విధంగా తెరకెక్కిన మా చిత్రానికి వస్తున్న స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. చిత్రయూనిట్ మొత్తం ఈ రెస్పాన్స్‌తో సంతోషంగా ఉన్నాము. ఫిబ్రవరి 27 నుంచి థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ సినిమా చూడండి. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత పెద్ద సక్సెస్‌ని ఇచ్చిన ప్రేక్షకులకు చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..’’ అన్నారు.

Veerababu PRO
9396410101