నా తల్లితండ్రులు గ‌ర్వంగా త‌లెత్తుకునేలా `అశ్వ‌థ్థామ‌` సినిమా చేశాను- నాగ శౌర్య

500

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`.ఈ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా టీజర్‌ని డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. ఉద‌యం 11గంటల 7 నిమిషాలకు హీరోయిన్ సమంత ట్విట్టర్‌లో ఈ టీజ‌ర్‌ను విడుల చేశారు. ఈ టీజ‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – “యంగ్ టీమ్ అందరితో కలిసి చేసిన పవర్ ప్యాక్డ్ ఫిలిం ఇది. డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్‌ను రమణ తేజ ఫెంటాస్టిక్గా ప్రెజెంట్ చేశాడు. టీజర్తో పటు మూవీ కూడా అందరికీ నచ్చుతుంది“ అన్నారు.

చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – “నన్ను నమ్మి ఇంత భారీ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థాంక్స్. కంటెంట్ సినిమాలో కీల‌కంగా ఉంటుంది. శౌర్య ఐడియా చాలా బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. నాగశౌర్య విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారు. అంత అద్భుతంగా నటించారు. ప్ర‌తి స‌న్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలాంటి బిగ్ కమర్షియల్ మూవీ నాలాంటి కొత్త డైరెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. మనోజ్ బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. శ్రీ చరణ్ మ్యూజిక్ అమేజింగ్. ఎడిటర్ గ్యారీ సెట్ కి వచ్చి ఆన్లైన్ ఎడిటింగ్ చేశాడు. సినిమా అందరికి నచ్చుతుంది.. అన్నారు.

చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ – “మా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 3 చిత్రం అశ్వథ్థామ‌`. కంటెంట్ ని నమ్మి ఈ సినిమా తీశాం. టీమ్ అంత కష్టపడి వర్క్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుందని నమ్మకం వుంది“ అన్నారు.

నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – “ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా టీమ్ అందరూ హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. జనవరి 31న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా మంచి విజయం సాదిస్తుంది.. అన్నారు.

హీరో నాగ శౌర్య మాట్లాడుతూ – ““చలో` టీజర్ ఇక్కడే రిలీజ్ చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. `నర్తనశాల` టీజర్ కూడా ఇదే ప్లేస్ లో రిలీజ్ చేశాం. డిజాస్టర్ అయింది..మరి ఇప్పుడు `అశ్వథ్థామ` టీజర్ రిలీజ్ చేస్తున్నాం.

నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
క‌థ‌: నాగ‌శౌర్య‌
ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: బుజ్జి
డిజిట‌ల్‌: ఎంఎన్ఎస్ గౌత‌మ్‌
డైలాగ్స్‌: ప‌రుశురాం శ్రీనివాస్‌
యాక్ష‌న్‌: అన్బ‌రివు
కొరియోగ్రాఫ‌ర్‌: విశ్వ ర‌ఘు