శ్రీవిష్ణు ఎంతో ఒదిగి ఉంటారు – అర్జున ఫల్గుణ ప్ర‌మోష‌న్స్‌లో హీరోయిన్ అమృతా అయ్యర్

805

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తేజ మర్ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం అర్జున ఫల్గుణ. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరోయిన్ అమృతా అయ్యర్ మీడియాతో ముచ్చటించారు.

అర్జున ఫల్గుణ స్క్రిప్ట్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేను ఒకరిని. ఫ్రెండ్స్‌కి కష్టం వస్తే సాయం చేసేందుకు ముందుకు వస్తాను. పరిస్థితులు అనుకూలించకపోయినా ఫ్రెండ్ కోసం నిలబడటమనే పాయింట్ బాగా నచ్చింది. ఫ్రెండ్ అంటే జండర్ చూడకూడదు. అవసరంలో సాయం చేయాలన్నది బాగా నచ్చింది.

 

పర్సనల్ లైఫ్‌లోనూ నా ఫ్రెండ్స్‌కు సాయం చేశాను. కానీ ఇలా అడవుల్లోకి వెళ్లలేదు. నా వల్ల ఎంత అయిందో అంత చేశాను. అమ్మాయిగా నేను ఎంత చేయగలనో అంత చేశాను.

అర్జున్ ఫల్గుణ అనేది విలేజ్ డ్రామా. రాజమండ్రిలో జరిగిన యథార్ఘ ఘటన ఆధారంగా తెరకెక్కించారు.

శ్రీ విష్ణుతో ఇదే మొదటి సినిమా. మొదట్లో ఆయన చాలా రిజర్వ్డ్ అని అనుకున్నా. నేను కూడా రిజర్వ్డ్ పర్సన్నే. కానీ శ్రీవిష్ణు ఎంతో త్వరగా కలిసిపోయారు. లెవెల్ చూపించరు. ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. మేం ఇద్దరం నటించినట్టు ఉండదు.. యాక్షన్ రియాక్షన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

ఫైనల్ సినిమా ఇంకా చూడలేదు. రషెస్ మాత్రమే చూశాను. ఈ సినిమాలో సంగీతం బాగుంటుంది. నరేష్ గారి పాత్ర, పోలీస్ కారెక్టర్ ఈ సినిమాలో బాగా ఉంటుంది.

సల్వార్ ధరించి అడవుల్లో పరిగెత్తడం చాలెంజింగ్‌గా అనిపించింది. బాంబ్ బ్లాస్ట్ సీన్‌లో సెట్‌లో బై మిస్టేక్‌గా బాంబ్ పేలింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొండల మీదకు కేరవ్యాన్ రాదు. రాను పోను మూడు గంటల జర్నీ ఉంటుంది. అదొక ట్రెక్కింగ్‌లా అనిపించింది. రెండు మూడు రోజులు కొండ మీదే షూటింగ్ జరిగింది. దాదాపు 50 శాతం షూటింగ్ అడవుల్లోనే ఉంటుంది.

తేజ తెరకెక్కించిన జోహర్ సినిమాను చూశాను. అర్జున ఫల్గుణ జరుగుతున్న సమయంలోనే దర్శకుడు చెప్పారు. అందుకే జోహార్ చూశాను. అర్జున ఫల్గుణ సినిమాలోని గ్రూపులో నన్ను అమ్మాయిలా కాకుండా.. అబ్బాయిలా చూశారు. నేను ఎలా చేయగలను అని అంటే.. మోటివేట్ చేసి మరీ దర్శకుడు నా చేత కొన్ని సీన్లు చేయించారు.

రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. సినిమాల పరంగా సంతృప్తిగా ఉన్నాను. నాకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశాను అని అనిపించింది. మంచి రివ్యూలు కూడా వచ్చాయి.

నాకు సెట్ అయ్యే పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. హద్దులనేవి పెట్టుకోలేదు. ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. అలాంటి పాత్ర ఇలాంటి పాత్ర చేయాలనేమీ పెట్టుకోలేదు. నాకు ట్రెడిషనల్ పాత్రలే వస్తున్నాయి. సిటీ అమ్మాయి పాత్రలు చేయాలని ఉంది. గ్లామర్ రోల్స్ నాకు కంఫర్టబుల్‌గా ఉండదు.

స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం. మొదటగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫిట్ నెస్ ఎలా మెయింటైన్ చేయాలో నాకు తెలీదు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతున్నాను. స్కూల్‌లో బాస్కెట్ బాల్ ఆడేదాన్ని.

సినిమాల్లోకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. నాకు హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత అంటే ఇష్టం.

నాకు ఇలాంటి పాత్రలే చేయాలనే కోరిక ఏమీ లేదు. ప్రస్తుతం హను మాన్ సినిమాను చేస్తున్నాను. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నేను నిర్మాతలను ఎలాంటి డిమాండ్ చేయలేదు. నేను అడిగితే అది ఏర్పాటు చేసేవారు. వారితో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా అనిపించింది.

తమిళంలో ఇంకా సినిమాలు ఓకే చేయలేదు. ఏదైనా సినిమాలు కమిట్ అయితే చెబుతాను.
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385