HomeTeluguక‌ళాత‌ప‌స్వి ఆశీస్సుల‌తో `అప్పుడు-ఇప్పుడు` సాంగ్ లాంచ్ == `అప్పుడు - ఇప్పుడు` టీమ్‌ పై క‌ళాత‌ప‌స్వి...

క‌ళాత‌ప‌స్వి ఆశీస్సుల‌తో `అప్పుడు-ఇప్పుడు` సాంగ్ లాంచ్ == `అప్పుడు – ఇప్పుడు` టీమ్‌ పై క‌ళాత‌ప‌స్వి ప్ర‌శంస‌లు

యు.కె.ఫిలింస్ నిర్మిస్తొన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లు. చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ నాయికానాయిక‌లు. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్త‌వుతోంది. దసరా కానుక‌గా విడుద‌లై ఫస్ట్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా తొలి పాట విడుద‌లైంది. ఈ పాట‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది.

ఈ సంద‌ర్భంగా లెజెండ్ కె.విశ్వ‌నాథ్ మాట్లాడుతూ-“ఫీల్ గుడ్ చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎప్పుడూ త‌గ్గ‌దు. అప్పుడు ఇప్పుడు క‌థాంశం ఆ త‌ర‌హానే. న‌వ‌త‌రం న‌టీనటులు రాణించాలి. రాజీ ప‌డ‌కుండా తెర‌కెక్కిస్తున్నార‌నే పోస్ట‌ర్లు చెబుతున్నాయి. నా చేతుల‌మీదుగా విడుద‌లైన పాట బాణీ, సంగీతం ఆక‌ట్టుకుంది. సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాలి. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. న‌టీన‌టుల‌కు పేరు రావాలి“ అని అన్నారు.

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – “ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. అంద‌రికీ న‌చ్చుతుంది. కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు హైలెట్. ఫాల్కే గ్ర‌హీత కె.విశ్వ‌నాథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజ‌వ్వ‌డం ఆనందంగా ఉంది“ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ “విజయదశమికి రిలీజ్ చేసిన‌ ఫస్ట్ లుక్ కి స్పంద‌న బావుంది. దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఎన్నో సంగీత ప్ర‌ధాన చిత్రాల్ని క‌ళాఖండాల్ని తెర‌కెక్కించిన‌ క‌ళా త‌ప‌స్వి చేతుల‌మీదుగా ఈ పాట‌ను రిలీజ్ చేయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం. ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ విజ‌యం సాధిస్తుంది“ అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి …కెమెరా: కల్యాణ్ సమి, ఆర్ట్: ఠాగూర్,ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, దర్శకత్వం: చలపతి పువ్వల.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES