మెదటి చిత్రం రాజావారి రాణి గారు తో మంచి విజయాన్ని కౌంట్ లో వేసుకున్నయంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన రెండవ చిత్రంగా ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రానికి సంభందించి ఆడియో లో మెదటి సింగిల్ ని సింగిల్ చూసాలే కళ్లారా కి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో దాదాపు 10 మిలియన్ వ్యూస్ రావటం విశేషం. ఆర్ ఎక్స్ 100 చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సెకండ్ సింగిల్ చుక్కల చున్ని అనే లిరిక్ తో మెదలయ్యే ఈ సాంగ్ ని మెస్ట్ క్రేజియస్ట్ సింగర్ అనురాగ్ కులకర్జి పాడారు. ఈ సాంగ్ ని ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు ప్రమోద్,రాజు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తో శ్రీధర్ గాదే దర్శకునిగా పరిచయం అవుతున్నారు. టాక్సివాలా చిత్రం తో అందర్ని ఆకట్టకున్న ప్రియాంక జవాల్కర్ కిరణ్ అబ్బవరం కి జోడి గా నటిస్తున్నారు.
ఈ సందర్బంలో నిర్మాతలు ప్రమోద్, రాజు లు మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం మెదటి చిత్రం రాజా వారి రాణి గారు మాకు చాలా బాగా నచ్చింది. ఈ లాక్‌డౌన్ లో ఎమజాన్ ప్రైమ్ లో మోస్ట్ వీవర్‌షిప్ వున్న టాప్ 5 చిత్రాల్లో ఈ చిత్రం కూడా వుందంటే కిరణ్ ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకున్నాడో చెప్పనక్కర్లేదు.కిరణ్ తో రెండవ చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం చేయటం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రానికి సంబందించిన మెదలి లుక్, మెదటి సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండవ సాంగ్ చుక్కల చున్ని ని విడుదల చేశాము. ఇన్‌స్టెంట్ హిట్ గా ఈ సాంగ్ దూసుకెళ్ళటం మా చిత్ర విజయానికి మెదటి మెట్టనే చెప్పాలి. ఈ చిత్రం లో హీరో కిరణ్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ లు మద్య వచ్చే రొమాంటిక్ చిలిపి సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ చూసిన వారంతా అదే చెప్తున్నారు. అలాగే కిరణ్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాయని అందరూ అంటున్నారు. అనురాగ్ కులకర్ణి అద్యుతమైన వాయిస్ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం లో డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు చాలా మంచి పాత్ర లో నటిస్తున్నారు. కిరణ్, సాయికుమార్ మద్య వచ్చే ప్రతి సన్నివేశం హ్రుదయాన్ని హత్తుకునేలా వుంటుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది అని అన్నారు.
Artists
కిరణ్ అబ్బవరం, ప్రియాం :క జావాల్కర్, సాయికుమార్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ : ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ప్రమోద్ – రాజు
కెమెరా : విశ్వాస్ డేనియల్
సంగీతం : చైతన్ భరద్వాజ్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను – మేఘశ్యామ్
దర్శకత్వం : శ్రీధర్ గాదె
Song Youtube link
Eluru Sreenu
P.R.O