ఆమని పుట్టినరోజు సందర్భంగా ‘అమ్మ‌దీవెన’ ఫస్ట్ లుక్ విడుదల

536

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కెతున్న చిత్రం ‘అమ్మ‌దీవెన‌’. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆమ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 16న శ‌నివారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీ‌దేవి, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా
ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో…

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఒక మంచి శుభ సంద‌ర్భంలో పోస్ట‌ర్‌ని విడుద‌ల చెయ్య‌డం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులు చిన్న మారయ్య గుర‌వ‌య్య ప్రొడ్యూసర్స్ గా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వ‌స్తుంది. ఎటువంటి దీవెన అయినా త‌క్కువ‌వ్వొచ్చు కాని ‘అమ్మ‌దీవెన’ ఎక్క‌డా తక్కువ‌కాదు. ఈ చిత్రంలో అమ్మ పాత్ర‌లో న‌టిస్తున్న ఆమ‌నిగారికి అభినంద‌న‌లు తెలియజేస్తున్నా” అన్నారు.

నటి ఆమ‌ని మాట్లాడుతూ… నేను ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఒక త‌ల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించాము. ఒక తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్ల‌ల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ప‌డుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూస‌ర్లు వాళ్ళ అమ్మ మీద ప్రేమ‌ని సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. శివ‌ గారుఈ సినిమా చెప్పిన‌ప్పుడు అన్ని సీన్స్ చాలా బావుంటాయి. కొన్ని స‌న్నివేశాలు చాలా నాచ‌ర‌ల్‌గా తీశారు. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలోనే డీ గ్లామ‌ర్ పాత్రలో న‌టించాను.

ద‌ర్శ‌కుడు శివ ఏటూరి మాట్లాడుతూ… నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది చాలా మంచి మూవీ ఈ నెల ఆఖ‌రు లోపు ఆడియో విడుద‌ల కాబోతుంది త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం” అన్నారు.

ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, యశ్వంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
దర్శకత్వం: శివ ఏటూరి,
నిర్మాతలు : ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య,
మాటలు : శ్రీను. బి,
సంగీతం : ఎస్.వి.హెచ్,
డి ఓ పి : సిద్ధం మనోహర్,
ఎడిటర్ : జె.సి,
డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి,
ఫైట్స్ : నందు,
పి.ఆర్ఓ. : సాయి సతీష్.