ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న “అక్షర”*

390

నందితశ్వేతా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది..

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: మా “అక్షర” సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నాం. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా ‘‘అక్షర’మూవీ’ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింది.ఇంకా మంచి ఆఫర్ లు వస్తున్నాయి ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం.ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది ’’ అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

కెమెరామాన్ : నగేష్ బెనల్,సంగీతం : సురేష్ బొబ్బిలి,ఎడిటర్ : జి.సత్య,ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరికాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు,లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్ నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ

రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ. 

PRO ; GSK MEDIA