HomeTeluguఎఫ్ ఎన్ సి సి ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో గెలిచిన...

ఎఫ్ ఎన్ సి సి ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది

క్రికెట్‌కు ఉన్న ఆధరణ ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకర– ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆధరణ ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకరమని రాష్ట్ర అవినీతి నిరోదక శాఖ సీవీ ఆనంద్‌ అన్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో సీబీ రాజు మెమోరియల్‌ పురుషుల విభాగం టెన్నిస్‌ టోర్నమెంట్‌ బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఆయన టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ చాలా మంది టెన్నిస్, ఇతర క్రీడల్లో ఆర్ధిక స్థోమత లేక రాణించలేకపోతున్నారని దురదృష్టవశాత్తు చాలా మంది స్పాన్సర్లు క్రికెట్‌ క్రీడకు స్పందించినట్లు ఇతర క్రీడలకు స్పందించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్, టెన్నిస్‌ ఇలా పలు రకాల క్రీడలను, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌ నిర్వహించిన ఎఫ్‌ఎన్‌సీసీ నిర్వాహకులతో పాటు దాతలను ఆయన అభినందించారు. క్రీడాకారులకు ఆర్ధిక భరోసా లేకపోతే చాలా క్రీడలు మరుగునపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పెద్ద టోర్నమెంట్లు నిర్వహంచాలని ఆయన కోరారు. అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేందుకు డబ్బులు లేక కూడా చాలా మంది క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారని దీని వల్ల విలువైన క్రీడాకారులు దేశానికి దూరమవుతున్నారని అన్నారు. వారం రోజుల పాటు జరిగిన పురుషుల విభాగంలో డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా ఢిల్లీకి చెందిన రిక్కీ చౌదరి, ఒడిషాకు చెందిన కబీర్‌ హన్స్‌ గెలుపొందగా, సింగిల్స్‌ విభాగంలో రన్నరప్‌గా జె. విష్ణువర్ధన్, విన్నర్‌గా గుజరాత్‌కు చెందిన దేవ్‌ జాబియా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, స్పోర్స్‌ కమిటీ చైర్మన్‌ చాముండేశ్వరినాథ్, సెక్రటరి ముళ్ళపుడి మోహన్, మాజీ అధ్యక్షుడు కేఎల్‌.నారాయణ, కాజా సూర్యనారాయణ, ఎఫ్‌ఎన్‌సీసీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, జాయింట్ సెక్రెటరీ వివిఎస్ఎస్ పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, జే. బాలరాజు గారు, శైలజ జుజల గారు, కె. మురళీమోహన్ రావు గారు, ఏ. గోపాల్ రావు గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, టెన్నిస్ మెంబర్స్ ఆర్. జగదీష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు స్పాన్సర్లు అయిన సువెన్‌ లైఫ్‌ సైన్సెస్, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES