HomeTeluguఆద్యంతం వైభవోపేతంగా జరిగిన `అల వైకుంఠ‌పుర‌ములో` మ్యూజిక‌ల్ ఫెస్టివల్

ఆద్యంతం వైభవోపేతంగా జరిగిన `అల వైకుంఠ‌పుర‌ములో` మ్యూజిక‌ల్ ఫెస్టివల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ(చిన‌బాబు) నిర్మిస్తోన్న చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. పూజ హెగ్డే నాయిక. చిత్రం ఈనెల 12 న విడుదల అవుతోంది ఎస్.ఎస్‌.త‌మ‌న్ అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక‌ల్ కాన్‌స‌ర్ట్ సోమ‌వారం హైద‌రాబాద్ యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను చిత్ర నిర్మాత‌లు అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా …

జిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ – నేను కూడా బ‌న్నీకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఒక ఫ్యాన్‌గా ఉంటేనే ఇలా కంపోజ్ చేయ‌గ‌లం. త్రివిక్ర‌మ్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న వ‌ల్లే నేను ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. అలాగే నిర్మాత‌లు, రెండు పెద్ద బ్యాన‌ర్స్ హారిక అండ్ హాసిని, గీతాఆర్ట్స్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అందరికీ  థ్యాంక్స్‌“ అన్నారు.

నాయిక నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో బ‌న్నీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళంలో నేను ప‌నిచేసిన  పెద్ద సినిమా ఇదే. త్రివిక్ర‌మ్‌గారు సినిమాను డిఫ‌రెంట్‌గా తెర‌కెక్కించారు.బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌, అర‌వింద్‌, సుశాంత్‌, చిన‌బాబు గార్లతో  స‌హా అంద‌రికీ  పెద్ద థ్యాంక్స్‌. సినిమా కోసం ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను“ అన్నారు.

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “ఈ సినిమాను క‌ష్ట‌ప‌డి తీసింది నా స్నేహితుడు రాధాకృష్ణ‌గారే. ఆయ‌న‌కు అభినంద‌న‌లు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చిన్న క‌థ‌ను బ్ర‌హ్మాండంగా తీసి, రిలీజ్‌కుముందే హిట్ అనే రూపాన్ని ఇచ్చాడు. త‌మ‌న్ 2019 వీడ్కోలు చెప్ప‌డానికి ప్ర‌తిరోజూ పండ‌గే సినిమా, ఈ 2020 వెల్‌క‌మ్ చెప్ప‌డానికి అల వైకుంఠ‌పుర‌ములో సినిమా ఇచ్చాడు. త‌న‌కు థ్యాంక్స్‌“ అన్నారు.

చిత్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఓ రూమ్‌లో మ‌ధ్యాహ్నం 3-4 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌గా ట్రాఫిక్ లేని స‌మ‌యంలో 30 ఏళ్ల యువ‌కుడు, 60 ఏళ్ల పెద్దాయ‌న కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృద‌యాల‌ను తాకింది. అదే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న.అన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ – ““ఎంట్రోయ్  గ్యాప్ ఇచ్చావ్‌.. ఇవ్వ‌లా వ‌చ్చింది“ ఇది డైలాగ్ కాదు, నా జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నే. ఎందుకింత గ్యాప్ తీసుకున్నార‌ని అంద‌రూ అడిగారు. వారికి నేను చెప్పేది ఒక‌టి. నా మూడు చిత్రాలు సరైనోడు, డీజే , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అయిన త‌ర్వాత చాలా స‌ర‌దా సినిమా చేయాలి. ఈజ్ ఉండాలి. ఎన్ని క‌థ‌లు విన్నా సుఖం రాలేదు. అలాంటి క‌థ సెట్ కావ‌డానికి త్రివిక్ర‌మ్‌గారు సిద్ధమవటానికి .. సినిమా చేయడానికి ఇంత టైమ్ ప‌ట్టింది అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES