`2 అవ‌ర్స్ ల‌వ్‌` ట్రైల‌ర్ విడుద‌ల 

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం `2 అవ‌ర్స్ ల‌వ్‌`. కృతి గార్గ్ హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రేమ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ స‌రికొత్త ప్రేమ క‌థాంశంతో `2 అవ‌ర్స్ ల‌వ్` చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శ‌నివారం హైద‌రాబాద్ రామానాయుడు

605

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం `2 అవ‌ర్స్ ల‌వ్‌`. కృతి గార్గ్ హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రేమ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ స‌రికొత్త ప్రేమ క‌థాంశంతో `2 అవ‌ర్స్ ల‌వ్` చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శ‌నివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుద‌ల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నప్ర‌ముఖ నిర్మాత‌ రాజ్ కందుకూరి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…
రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “`2 అవ‌ర్స్ ల‌వ్` అంటే రెండు గంట‌ల పాటు ప్రేక్ష‌కుల‌ను ప్రేమ‌లోనే ఉంచే సినిమా అని అనుకుంటున్నాను. ఓ సినిమాలో హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేయ‌డ‌మంటే అంత సామాన్య‌మైన విష‌యం కాదు. శ్రీప‌వార్ ఆవిష‌యంలో సూప‌ర్బ్‌. చాలా బాగా చేశాడ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్‌లో మంచి కంటెంట్‌తో సినిమా రూపొందింద‌ని అర్థ‌మ‌వుతుంది. సాధార‌ణంగా నా దృష్టిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాల‌ని ఉండ‌వు. మంచి, చెడు సినిమాల‌నే ఉంటాయి. కంటెంట్ ఉండే సినిమాల‌నే ప్రేక్ష‌కుల‌ను ఆద‌రిస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒక‌ట‌వుతుంద‌ని భావిస్తున్నాను. గ్యాని సింగ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్‌గా కుదిరింది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ – “హీరోయిన్‌గా నా తొలి చిత్ర‌మిది. ద‌క్షిణాది సినిమాల‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డం ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. మంచి క్యారెక్ట‌ర్ పోషించాను. సినిమా క‌థంతా నా చుట్టూనే తిరుగుతుంది. మంచి రోల్ ఇచ్చి ఎంక‌రేజ్ చేసిన మా హీరో, డైరెక్ట‌ర్ శ్రీప‌వార్‌గారికి థాంక్స్‌“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అఖిల గంజి మాట్లాడుతూ – “నిర్మాత‌గా నా తొలి ప్ర‌య‌త్నం. యూనిట్ అంద‌రం క‌ష్ట‌ప‌డి చేశాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం. మంచి టీమ్ ఎఫ‌ర్ట్‌తో చేసిన ఈ సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో, ద‌ర్శ‌కుడు శ్రీ ప‌వార్ మాట్లాడుతూ – “మా యూనిట్‌ను ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డ‌కు విచ్చేసిన రాజ్ కందుకూరిగారికి థాంక్స్‌. నాకు చిన్న‌ప్పటి సినిమాలంటే ఆస‌క్తి.. ముఖ్యంగా దర్శ‌కత్వం గురించి ఎక్కువ‌గా ఆలోచించేవాడిని. న‌న్ను ద‌ర్శ‌క‌త్వం వైపు ఇన్‌స్పైర్ చేసిన వ్య‌క్తి సుకుమార్‌గారు. ఆయ‌న డైరెక్ట‌ర్ చేసిన సినిమాల‌ను చూసే ద‌ర్శ‌కత్వం చేయాల‌నుకున్నాను. కాబ‌ట్టి మా `2 అవ‌ర్స్ ల‌వ్‌` చిత్రాన్ని ఆయ‌న‌కు డేడికేట్ చేస్తున్నాను. హీరోయిన్‌గా తెలుగు అమ్మాయినే తీసుకోవాల‌ని చాలా మందిని ఆడిష‌న్ చేశాం. కానీ ఎవ‌రూ మాకు న‌చ్చ‌లేదు. దాంతో ముంబై వెళ్లి కృతిగార్గ్‌ను ఎంపిక చేసుకున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే న‌లుగురు వ్య‌క్తులు కార‌ణం. వారే నా పిల్ల‌ర్స్‌. ముందుగా మా అమ్మ‌గారికి థాంక్స్‌. ఆమె ఎంతో ఎంక‌రేజ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అఖిల నా స్నేహితురాలు. క‌థ న‌చ్చ‌డంతో సాఫ్ట్ వేర్ అమ్మాయి అయినా కూడా సినిమా రంగంపై ఆస‌క్తితో నాకు స‌పోర్ట్ చేసింది. త‌ను లేక‌పోతే ఈ సినిమానే లేదు. ఆమె భ‌ర్త కూడా ఎంతో స‌పోర్ట్ చేశారు. వారిద్ద‌రికీ నా థ్యాంక్స్‌. త‌ర్వాత మా అక్క‌య్య‌కు, బావ‌గారికి థాంక్స్‌. ఎంటైర్ టీం బాగా స‌పోర్ట్ చేశారు. త్వ‌ర‌లోనే విడుద‌ల గురించి తెలియ‌జేస్తాం“ అన్నారు.

ప‌వార్‌, క్రితి గార్గ్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక్ వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీప‌వార్,నిర్మాణం: శ‌్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌, సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి, ఎడిట‌ర్‌:  శ్యాం వ‌డ‌వ‌ల్లి,  మ్యూజిక్‌: గ‌్యాని సింగ్‌, ఆర్ట్‌:  వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అఖిల గంజి, కో డైరెక్ట‌ర్‌: ఎం.శ్రీనివాస్ రాజు.