నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలై అద్భుతమైన పాజిటివ్ స్పందనను రాబట్టుకున్న సందర్బాంగా చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ఈ రోజు ఏ సినిమా విడుదలైంది. సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చుసిన ప్రతి ఒక్కరు బాగుందని అంటున్నారు. ఈ సినిమాను హొనెస్ట్ గా తీసాం కానీ ఎక్కడో చిన్న టెన్షన్ ఉండింది .. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కానీ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు మంచి రేటింగ్స్ ఇచ్చిన క్రిటిక్స్ కు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళ సమయం పట్టింది. ఈ జర్నీ లో నాకు చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయకపోయి ఉంటె ఈ సినిమాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది కాదు. మా కెమెరా మెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఇలా ప్రతి ఒక్కరు మా టీం సపోర్ట్ అంతా మాటల్లో చెప్పలేను. ఈ సినిమాను వాళ్ళు కూడా ఒన్ చేసుకుని నిద్ర హారాలు మాని మరి సినిమాకు పని చేసారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లిద్దరూ టెరిఫిక్ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా. ఈ సినిమాకు ప్రసాద్ లాబ్స్ వారు కూడా సపోర్ట్ చేసారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… ఈ సినిమాకు సపోర్ట్ చేసిన పివిఆర్ ఉదయ్ గారి సపోర్ట్ వల్లే ఈ రోజు ఈ సినిమా విడుదల అయింది. ఆయనకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. ఓపెన్ మైండ్ తో సినిమా చుడండి.. ఎదో ఉహించుకుని చుస్తే కాదు.. అలాగే ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్పడం చాలా అందంగా ఉంది అన్నారు.
పివిఆర్ పిక్చర్స్ ఉదయ్ మాట్లాడుతూ .. యుగంధర్ నన్ను కలిసినప్పుడు ఈ సినిమా గురించి నా దగ్గరికి రావొద్దని చెప్పను. కానీ ఈ సినిమాను రాత్రి చూసాక చాలా షాకింగ్ గా అనిపించింది. సినిమా మొదలయ్యాకా అసలు ఊహించింది ఏది జరగదు.. అలా ప్రేక్షకుడిని కట్టి పడేసేలా తీసాడు .. ఈ సినిమా చూసాకా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు.. కానీ ఈ దర్శకుడు మాత్రం అయన ప్రొడక్షన్ కానీ వర్క్ గురించి హాట్స్ అప్ చెప్పాల్సిందే. ఈ సినిమా విషయంలో అన్ని దగ్గరుండి చూసుకున్న యుగంధర్ గట్స్ కు హాట్స్ అప్ చెప్పాలి. అలాగే నిర్మాత గీతా గారు కూడా ఈ కథను నమ్మి చాలా దైర్యంగా సినిమా తీశారు. నేను ఎప్పుడు ఏ సినిమా గురించి ఇంతలా చెప్పలేదు.. నిజంగా ఈ సినిమా చాలా మంచి సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందని కచ్చితంగా చెప్పగలను, ఇక హీరో నితిన్ ప్రసన్న నటన సినిమాకే హైలెట్ .. సో ఈ సినిమా సక్సెస్ అయినా సందర్బంగా టీం కు కంగ్రాట్స్ చెబుతున్నాను అన్నారు .
హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ .. చాలా నెర్వస్ గా ఉంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాను. నేను హీరోగా నటించిన మొదటి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ ఉండేది. ముక్యంగా ఈ సినిమాకు ఒకేసారి మూడు పాత్రలు చేయడం కూడా రిస్క్ అనిపించింది. నేను మూడు పాత్రల్లో నటిస్తే జనాలు చూస్తారా అన్న సందేహం ఉండేది. కానీ ఈ సినిమాకు ఈ రోజు వస్తున్నా పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా విషయంలో పివిఆర్ పిక్చర్స్ వారికీ థాంక్స్ చెబుతున్నాను. హీరోగా నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికి థాంక్స్. ఈ సినిమా విషయంలో క్రెడిట్ మొత్తం మా దర్శకుడు యుగంధర్ కు వెళ్తుంది. అలాగే మా నిర్మాత గీత గారు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఒక కొత్త నటుడైన నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ ని నేనెప్పటికీ మరచిపోలేను అన్నారు.
నిర్మాత గీత గీతా మిన్సాల మాట్లాడుతూ .. ఇది మా మొదటి సినిమా. ఈ సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కొత్తవాళ్ళమైనా కూడా మాకు మీడియా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. సినిమా మంచి కథతో తెరకెక్కించాం. మంచి కథ ఉంటె ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తారన్న నమ్మకం ఉంది. అలాగే హీరో నితిన్ ప్రసన్న మూడు పాత్రల్లో అద్భుతంగా నటించారు. మూడు పాత్రల్లో నితిన్ ప్రసన్న అనుభవం ఉన్న నటుడిగా అనిపించారు. షూటింగ్ కు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అయన వచ్చేవాడు. అలాగే మా దర్శకుడు యుగంధర్ కూడా అన్ని విషయాల్లో దగ్గరుండి చూసుకున్నారు. అలాగే హీరోయిన్ ప్రీతి అస్రాని కూడా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. హీరోకి పోటీగా నటించి ఆకట్టుకుంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు అన్ని ఎరియస్ ఉంది వస్తున్నా రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.
నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని, బేబీ దీవెన తదితరులు
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ),
సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ),
సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్),
ఎడిటింగ్: ఆనంద్ పవన్, మణి కందన్ (ఎఫ్‌టిఐఐ),
పిఆర్ ఓ: సతీష్, పర్వతనేని రాంబాబు,
సంగీతం: విజయ్ కురాకుల,
నిర్మాత: గీతా మిన్సాల
దర్శకత్వం: యుగంధర్ ముని.
—
P.Rambabu & Sai Satish
9848 123 007