HomeTeluguరాజ‌మండ్రి పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం.భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేసిన ‘భానుమ‌తి రెడ్డి’ ఫ‌స్ట్ లుక్

రాజ‌మండ్రి పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం.భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేసిన ‘భానుమ‌తి రెడ్డి’ ఫ‌స్ట్ లుక్

బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రస్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రాజ‌మండ్రి పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం.భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేసి సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు మంచి పేరు రావాల‌ని, నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డికి సినిమా అన్ని ర‌కాలుగా పెద్ద స‌క్సెస్ కావాల‌ని అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా…

ద‌ర్శ‌కుడు స‌త్య మాట్లాడుతూ ‘‘‘భానుమ‌తి రెడ్డి’గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతోన్న ల‌వ్‌స్టోరి. ఫైన‌ల్ స్టేజ్ షూటింగ్‌కు చేరుకున్నాం. సినిమా అనుకున్న‌ట్లు బాగా వస్తోంది. రాజ‌మండ్రి ఎం.పి భ‌ర‌త్ రామ్‌గారు మా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసి అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌నకు స్పెష‌ల్ థాంక్స్‌. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే…ప్రేమ‌క‌థలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాల‌తో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రూపొందిస్తున్నాం. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డిగారు సినిమా విష‌యంలో పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు.

నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు మాట్లాడుతూ ‘‘భరత్ రామ్ గారికి థాంక్స్‌. మా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసి టీమ్‌కు ఆయ‌న అభినందించ‌డం మాకు ఓ బూస్ట‌ప్ ఇచ్చింది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు స‌త్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ‘భానుమ‌తి రెడ్డి’ను తెర‌కెక్కిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ తో
సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:

బాలు, అప్స‌ర‌, సాగ‌ర్ రెడ్డి వ‌ట్ర‌పు, జి జివికె చిరంజీవి , వినాయ‌క్‌, కార్తీక్‌ , నాగూర్ వ‌లి, ప‌ద్మావ‌తి, అర‌వింద్‌, హ‌రిణి, లోకేశ్వరి, నాజర్ భి, నంది వర్ధన్, శివ, విజయ్ క్రిష్ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌
నిర్మాత‌: రామ్ ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు
బ్యాన‌ర్‌: డైమండ్ హౌస్
సినిమాటోగ్ర‌ఫీ: క‌ళ్యాణ్ సమి
సంగీతం: అభిషేక్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
కొరియోగ్ర‌ఫీ: జై
కాస్ట్యూమ్స్‌: దుర్గ‌
మేక‌ప్‌: న‌ల్ల‌తీగ‌ల నాగరాజు
పాట‌లు: శ్రీధ‌ర్ ప‌ల్లె(శ‌శి)

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES