దర్శకుడు మారుతి క్లాప్ తో ‘శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ నూతన చిత్రం ప్రారంభం

639

అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై..ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు.జి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి..స్టోరి చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతున్న ఈ మూవీ ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి కానుంది. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు.జి. తెలిపారు. కొన్ని రియాలిస్టిక్ సంఘటన ల ఆధారం గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

నటీనటులు : అర్జున్ కళ్యాణ్, వసంతి తదితరులు

సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫి – మురళీధర్ సింగు, సంగీతం – మహవీర్ యెలందర్, విజువల్ ఎఫెక్ట్స్ : మహత్రు మీడియా సొల్యూషన్స్, లిరిక్స్ : పూడి శ్రీనివాస్, పీఆర్ ఓ : జి యస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వీరబాబు .కె, ప్రొడ్యూసర్ : జి. రాధిక, రచన, దర్శకత్వం : రామరాజు.జి.