ఇండస్ట్రీ లో సినిమాల ద్వారా తమను తాము “హీరో”గా నిరూపించుకోడానికి నటులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సినిమాల్లోకి రాకముందే నిజజీవితంలో గిన్నిస్ రికార్డ్స్ సాధించి “రియల్ హీరో”గా నిరూపించుకున్న వ్యక్తి టాలీవుడ్ యంగ్ హీరో “ఉదయ్ శంకర్.”
అందరిలా కాకుండా “ఆట గదరా శివ” లాంటి విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీరో ఉదయ్ శంకర్. ఆ తర్వాత తన రెండో సినిమాగా “మిస్ మ్యాచ్” అంటూ.. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో టాలీవుడ్ ఆడియెన్స్ ని మళ్ళీ మెప్పించారు.
ఇప్పుడు వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో “క్షణక్షణం” అంటూ ఒక మంచి ఇంట్రస్టింగ్ సినిమా ద్వారా ఫిబ్రవరి 26 న మన ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో “సత్య” గా ఉదయ్ గారి నటన చాలా సహజంగా ఉంది.
క్షణక్షణం సినిమా ద్వారా ఉదయ్ శంకర్ గారు అటు కమర్షియల్ గా ఇటు నటుడిగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుందాం.