*”మ్యాడ్” సినిమా ట్రైలర్ రిలీజ్*

404

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం “మ్యాడ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. “మ్యాడ్” సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా హాజరై “మ్యాడ్” చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ….మా కార్యక్రమానికి గెస్ట్ లు గా వచ్చిన మధుర శ్రీధర్ గారు, రాధాకృష్ణ గారికి థ్యాంక్స్. శ్రీధర్ గారు నా సోదరుడి లాంటి వారు. ఎంతో సపోర్ట్ చేశారు. నేను మీడియాను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే. చిన్న సినిమా మీ ప్రోత్సాహం వల్ల పెద్ద సినిమా అవుతుంది. మీరు చిరంజీవి, బాలకృష్ణ గారి గురించి రాస్తారు. చిన్న సినిమాల గురించీ రాస్తారు. నేను సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను. మా సినిమా బాగుంటే చాలా బాగుందని, ఫర్వాలేదనుకుంటే మంచి ప్రయత్నం అని రాయండి. మీడియా ప్రోత్సహిస్తే మామూలు సినిమా బెటర్ సినిమా అవుతుంది. మేము గొప్ప సినిమా చేశామని చెప్పడం లేదు. చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాం. మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నాం. వాళ్లతో మాట్లాడిన తర్వాత “మ్యాడ్” సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. మార్చిలో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది. అన్నారు.

అతిథి మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ….దర్శకుడు లక్ష్మణ్ నాకు మంచి మిత్రుడు. మ్యాడ్ మూవీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. ఇవాళ యూత్ లైఫ్ లో జరుగుతున్న కాంటెంపరరీ కాన్సెప్ట్ ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ల ప్రతిభ చూపించారు. సంగీత దర్శకుడు మోహిత్ కు ఇండస్ట్రీలో పేరు రావాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది, సూపర్ రెస్పాన్స్ రావాలి. అలాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ..చాలా రోజులుగా ఈ రోజు గురించి వేచి చూశాము. లక్ష్మణ్ గారికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా ఇలాగే మీకు నచ్చుతుంది. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారు. టీమ్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ కు కావాలి. అతిథిగా వచ్చిన మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. అన్నారు

హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ…ట్రైలర్ చూస్తే ఎలాంటి సినిమానో మీకు కొంత అర్థం అయ ఉంటుంది. మ్యాడ్ అంటే పిచ్చి అని కాదు మ్యారేజ్ అండ్ డివోర్స్ అని అర్థం. మ్యాడ్ అంటే ఏంటని పజిల్స్ పెట్టేవారు డెరెక్టర్ గారు. కానీ మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే టైటిల్ కుదిరింది. టైటిల్ కు తగినట్లే కథ ఉంటుంది. ఈ కథలో విలన్లు ఎ‌వరూ ఉండరు చిన్న చిన్న గొడవల వల్ల హీరో హీరోయిన్లు విడిపోతుంటాయి. మోహిత్ రెహ్మానియా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మ్యూజిక్ ను మధుర శ్రధర్ గారు ప్రమోట్ చేసి తన ఆడియో ద్వారా ప్రచారం తీసుకొచ్చారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహ్మానియా మాట్లాడుతూ….చెన్నై నుంచి వచ్చాక నా మొదటి సినిమా “మ్యాడ్”. సంగీత దర్శకుడికి దర్శకుడి విజన్ ఉండాలి. లక్ష్మణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. టెక్నీషియన్ కు ఏది కావాలో ఆయనకు తెలుసు. కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా పనిచేశారు. అన్నారు.

శ్వేత వర్మ మాట్లాడుతూ…సినిమా మిమ్మల్ని మర్చిపోయేలా ఉండాలని ఓ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అన్నారు. “మ్యాడ్” సినిమా కూడా చూస్తున్నంత సేపూ మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది. లవ్, సినిమా, మ్యూజిక్ …ఈ మూడు మాత్రమే బయట ప్రపంచం మర్చిపోయేలా లీనం చేస్తాయి. “మ్యాడ్” చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కథలో చూసుకుంటారు. మీ జీవితంలో జరిగే సంఘటనలే సినిమాలో ఉంటాయి. కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజై సక్సెస్ అవుతున్నాయి. మా సినిమాకు కూడా మీ ప్రేమ కావాలి. అన్నారు.

నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ….నా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాకు పనిచేసిన అందరికీ కంగ్రాట్స్. సినిమా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఇది నా మొదటి సినిమా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అన్నారు.

స్పందన పల్లి మాట్లాడుతూ…బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మీడియా వాళ్లు బిజీగా ఉన్నావచ్చినందుకు థ్యాంక్స్. ట్రెడిషనల్ తెలుగు అమ్మాయి రోల్ చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ లక్ష్మణ్ గారు నాకీ అవకాశం ఇచ్చారు. నిర్మాత కృష్ణారెడ్డి గారు రోజూ సెట్ కు వచ్చి షూటింగ్ తెలుసుకునేవారు. మోహిత్ వినసొంపైన సంగీతాన్ని ఇచ్చారు. శ్రీధర్ గారు మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. మా పాటలను బాగా ప్రమోట్ చేశారు. అన్నారు.

“మ్యాడ్” చిత్రానికి ప్రొడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు, కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్ ,పి ఆర్ ఒ : జియస్ కె మీడియా.