HomeTeluguసత్యదేవ్ *గువ్వ గోరింక* సినిమా....డైరెక్టర్ మోహన్ బమ్మిడి.

సత్యదేవ్ *గువ్వ గోరింక* సినిమా….డైరెక్టర్ మోహన్ బమ్మిడి.


సత్యదేవ్, ప్రీయలాల్, ప్రియదర్శిి ప్రధాన పాత్ర దారులుగా, రామ్ గోపాల్ వర్మ దగ్గర సర్కార్ నుండి రక్తచరిత్ర వరకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి దర్శకత్వంలో, జీవన్, దాము సంయుక్తంగా నిర్మించిన సినిమా గువ్వ గోరింక. ఈ సినిమా ఈ నెల 17న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు మోహన్ బమ్మిడి మాట్లాడుతూ : నా వరకు హ్యూమన్ రిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటరెస్టింగ్ టాపిక్ ఆన్ ది ఎర్త్. సినిమా అంటేనే డ్రైవ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్… ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్… అదేవిధంగా తక్కువ బడ్జెట్లో తియ్యగలిగే అందరికి టచ్ అయ్యే సబ్జెక్టు ఈ గువ్వ గోరింక.
ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని త్రీ టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ గురించి చెప్పాలనుకున్నాను… ఫిజికల్‌గా దూరంగా వున్నా మనసులు మనస్తత్వాల్లో దగ్గరగా వున్న ఒక జంట మెయిన్ ప్లాట్‌గా … ఫిజికల్‌గా దగ్గరగా వున్నా వారి మధ్య చాలా దూరం వున్న మరో జంట, అసలు ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ సెక్స్ కోసమే అనుకున్న మరో కుర్రాడు సబ్‌ప్లాట్స్‌గా వుంటాయి. ఈ మూడురకాల రిలేషన్‌షిప్స్ ప్రాధమికంగా ఒకే విషయాన్ని చెప్తాయి. అదేమిటంటే ఇక్కడవున్న రిలేషన్‌షిప్‌కి కారణం ప్రేమ అనుకుంటే అసలు మనం అనుకునే ప్రేమ నిజమైన ప్రేమేనా? అసలు ప్రేమంటే ఒకర్ని మరొకరు ఇష్టపడడమా… ఇంప్రెస్ చేసుకోవడమా… ఫిజికల్‌గా కలవడమా… లేకపోతే ఒకర్నొకరు అర్ధం చేసుకుంటూ ఒకరి బలహీనతలకు మరొకరు బలమై లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడమా… ఎదైతే బెటర్ అని చెప్పడం కంటేకూడా ఆయా రిలేషన్‌షిప్‌లో వున్న కోణాల్ని చెప్పాలనుకున్నాను…
హ్యూమన్ రిలేషన్‌షిప్ మీద ఆసక్తి అవగాహనికి కారణం మా అన్నయ్య బమ్మిడి జగదీశ్వరరావు కథలతో పాటు రావిశాస్త్రి, పతంజలి, బుచ్చిబాబు, గోపిచంద్, మహశ్వేతాదేవి, శరత్ చంద్ర కథలు ఇరానియన్ మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. నా గురువుగారు రామ్ గోపాల్ వర్మ దగ్గర సర్కార్ నుండి రక్తచరిత్ర వరకు నా ప్రయాణంలో చాలా విషయాలు అందులో ముఖ్యంగా కథ దానిలో వున్న కోణాలే కాకుండా ఎటువంటి కథనయినా సినిమాగా ఎలా మలచొచ్చు స్పాంటేనియస్ షూటింగ్ సెన్సుతో విత్ ఇన్ బడ్జెట్లో ఎలా తియ్యొచ్చో తెలుసుకున్నాను.

ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే సత్యదేవ్… వెరీ గుడ్ యాక్టర్. అయితే నేను తెలుసుకున్నదేంటంటే నేను అసోసియేట్ గా పనిచేసిన యాక్టర్స్ అమితాబచ్చన్, అజయ్ దేవగన్, సూర్య, వివేక్ ఒబెరోయ్‌లా షూట్లో తనకంటు స్పాంటేనిటీ వుంటుంది… అది ఆ క్యారక్టర్‌కి రియలిస్టిక్ నేచర్‌ని తీసుకొస్తుంది. ఆ కోవకి చెందిన ఆర్టిస్ట్ సత్యదేవ్.

ఇక ప్రియలాల్ విషయానికి వస్తే వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ టువర్డ్స్ వర్క్. ముఖ్యంగా ఈ అమ్మాయిని కాస్ట్ చెయ్యడానికి కారణం గర్ల్ నెక్స్ట్ డోర్‌లా వుంటుంది. ఇది సినిమాకి చాలా అవసరము.

ప్రియదర్శి … వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఐ ఎవర్ సీన్. దర్శి స్పాంటేనియస్ ఆల్ వేస్ ఎమ్యూసింగ్ టు మి. చైతన్య మరియు మధుమిత ఇద్దరు లివ్ ఇన్‌లో వున్న జంటగా క్యారెక్టర్స్‌‌ లో ఒదిగిపోయారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే నా బలమూ ధైర్యమూ వాళ్ళే. వెరీ లిమిటెడ్ రిసోర్సులో కూడా మేమనుకున్నది అచీవ్ చెయ్యగలిగానంటే ఆ క్రెడిట్ టెక్నిషియన్సుదే… ముఖ్యంగా డీవోపి మైలెసన్ రంగస్వామి నేననుకున్న విజువల్స్‌‌ ని 100 పెర్సెంట్ ఇవ్వగలగడమే కాకుండా దానికోసం రిలేటెడ్ డిపార్టుమెంట్స్‌తో కోఆర్డినేట్ చేస్తూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. నేను ముంబాయిలో అసోసియేట్గాక పనిచేస్తున్నప్పుడు డీవోపీ మైలెసన్, ఎడిటర్ ప్రణవ్ మిస్త్రితో కలిసి పనిచేసే వాళ్ళం అందువల్ల మా మధ్య బెస్ట్ కమ్యునికేషన్ వుంది… మూవీ ఎడిట్ టేబుల్ మీదే తయారవుతుందని ప్రణవ్ మరోసారి ప్రూవ్ చేసాడు.

మ్యూజిక్ విషయానికొస్తే సురేష్ బొబ్బిలి మా వేవ్ లెంగ్త్ కలవడానికి ఇబ్బంది పడినా తరువాత మాత్రం ఆయన మ్యూజిక్ విసువల్‌ని ఎన్‌హేన్స్ చేస్తూవచ్చింది. ఈ సినిమాకు సంబంధించి చాలా చాలా అవసరము మా ఆర్ట్ డైరెక్టర్ సాంబశివరావు నేను అడిగిన దాని కంటే బ్యూటీతో పాటు క్యారక్టరైజేషన్ మిస్ అవకుండా తన ఆర్ట్ వర్క్‌‌తో మూవీకి ఒక బ్యూటీని ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే జీవన్ ఈ సినిమా మొదలవడానికి కారణమైతే, దాము ఈ సినిమా మీముందుండడానికి కారణం అని అన్నారు

PRO: 10tv Satish Kottangi  

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES