త‌మ‌న్నాహీరో స‌త్య‌దేవ్ దర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ;”గుర్తుందా శీతాకాలం”

442


ప్ర‌తి ఒక్క‌రు త‌మ లైఫ్ లో సెటిల్ అయిన త‌రువాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు, ముఖ్యంగా టీనెజ్, కాలెజ్ ఆ త‌రువాత వ‌చ్చే యూత్ లైఫ్ లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ మీద నాగ‌శేఖ‌ర్ – భావ‌న‌ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు గారు సంయుక్తంగా నిర్మింస్తున్న సినిమా గుర్తిందా శీతాకాలం. ఇప్ప‌టికే ఈ సిసిమా టైటిల్ కు అంత‌టా విశేషాద‌ర‌ణ ల‌భిస్తున్న సంగ‌తి తెలిసిందే, అలానే టాలీవుడ్ స్టార్ న‌టీన‌టులు స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి త‌దిత‌ర‌లు న‌టిస్తుండ‌టంతో ఇటు ప్రేక్ష‌కుల్లో అటు ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లో ఈ సినిమా పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న‌ ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూట్ చేసుకుని మ‌రో షెడ్యూల్ షూట్ చేసుకోవ‌డానికి సెట్స్ మీద‌కు వెళుతున్న సంద‌ర్భంగా గుర్తుందా శీతాకాలం చిత్ర బృందం డిసెంబ‌ర్ 6న స్టార్ హోట‌ల్ తాజ్ డెక్క‌న్ – హైద‌రాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వ‌హించారు, ఈ కార్య‌క్ర‌మానికి హీరో స‌త్య‌దేవ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, డైరెక్ట‌ర్ నాగ‌శేఖర్, నిర్మాత భావ‌న‌ర‌వి, ఆనంద్ ఆడియో అధినేత శ్యామ్, చిత్ర స‌మ‌ర్ప‌కులు ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు, ర‌చ‌యిత్ ల‌క్ష్మీభూపాల్ త‌దిత‌రులు హ‌జరైయ్యారు

నిర్మాత భావ‌న‌ర‌వి, చిత్ర స‌మ‌ర్ప‌కులు ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు మాట్లాడుతూ

గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఈ సినిమాకు పెట్ట‌డంతోనే మా చిత్ర బృందం స‌గం విజ‌యాన్ని సాధించేశాము అని భావిస్తున్నాం. మా సినిమాకు అన్ని స‌రిగ్గా కుదిరాయి, హీరో స‌త్య‌దేవ్, హీరోయిన్లు త‌మ‌న్నా, మేఘఆకాష్, కావ్య‌శెట్టిలు త‌మ న‌ట‌న‌తో గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌కాలం గుర్తుండిపోయేలా చేస్తారు అని క‌చ్ఛింత‌గా చెప్ప‌గ‌ల‌ము. క‌న్న‌డ‌లో వ‌రుస బ్లాక్ బస్ట‌ర్స్ ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత నాగశేఖ‌ర్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేసే రీతిన తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు అని అన్నారు

ఆనంద్ ఆడియో అధినేత శ్యామ్ మాట్లాడుతూ

క‌న్న‌డ‌లో ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీగా ఆనంద్ ఆడియో ముందుకు వెళుతోంది. గుర్తందా శీతాకాంల సినిమాతో తెలుగులోకి ఆనంద్ ఆడియో తొలి అడుగువేస్తోంది. ఓ మంచి సినిమాతో ఆనంద్ ఆడియో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచయం అవ్వ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు

ర‌చయిత ల‌క్ష్మీభూపాల్ మాట్లాడుతూ

గుర్తుందా శీతాకాలం సినిమాకు నేను ఈ ఏడాది వేస‌విలోనే ప‌ని మొద‌లుపెట్టాను. బ‌హుశా నేనే ఈ సినిమాకు ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టిన మొద‌టి వ్య‌క్తి కావ‌చ్చు. నేను మాట‌లు అందించిన చంద‌మామ‌, అలా మొద‌లైంది, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబి వంటి సినిమాలు మాదిరిగానే గుర్తిందా శీతాకాలం కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే నమ్మ‌కం ఉంది. స‌త్య దేవ్, త‌మ‌న్నా వంటి ప్ర‌తిభావంత‌మైన న‌టీన‌టులు ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నారు అని అన్నారు

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ మాట్లాడుతూ

గుర్తుందా శీతాకాలం చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల్లో హృదాయాల్లో ఎప్ప‌టికీ గుర్తుండి పోయే చేయాల‌నే త‌ప‌న‌తో ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ర‌చయిత ల‌క్ష్మీ భూపాల్ ఈ సినిమా కోసం వేస‌విలో వ‌ర్క్ చేయ‌డం మొద‌లుపెడితే నేను వ‌ర్షాకాలంలో ప‌ని మొద‌లుప‌ట్టాను. ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ గారి సూచ‌న‌ల‌తో కొన్ని అద్భుత‌మైన ట్యూన్స్ ఈ సినిమా కోసం రెడీ చేశాము. ఓ మ్యూజిక‌ల్ ఫీల్ గుడ్ మూవీగా గుర్తుందా శీతాకాలం తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌న్నారు

ద‌ర్శ‌క‌నిర్మాత నాగ‌శేఖ‌ర్ మాట్లాడుతూ

ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ మాట‌లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ అందిస్తున్న ట్యూన్స్, సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య హెగ్డే షూట్ చేయ‌బోతున్న విజువ‌ల్స్, సినిమాల్లో అద్భుతంగా న‌టించ‌బోతున్న స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, మెఘా ఆకాష్, కావ్య‌శెట్టిల న‌ట‌న ఇంకా ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ ప్ర‌తిభ‌ను నూటికి నూరు శాతం బ‌య‌ట‌పెట్టి ఎంతో త‌ప‌నతో ప‌ని చేస్తున్నారు. క‌న్న‌డ‌లో నేను స్టార్ ద‌ర్శ‌కుడైన‌ప్ప‌టికీ తెలుగులో ఇది నా డెబ్యూ సినిమా, తెలుగు ప్రేక్ష‌కులు గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని, ద‌ర్శ‌కుడిగా నన్ను ఆద‌రిస్తార‌ని మ‌నఃస్పూర్తిగా న‌మ్ముతున్నాను

హీరో స‌త్య‌దేవ్ మ‌ట్లాడుతూ

ఈ సినిమాకు నేను హీరో అయిన‌ప్ప‌టికీ, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాగారు రియ‌ల్ హీరో, తాను ఈ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి గుర్తుందా శీతాకాలం గ్రాఫ్ మారిపోయింది. త‌మ‌న్నాగారితో పాటు మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి త‌ద‌త‌ర‌లు ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆకార్ష‌ణ‌గా నిలిచారు. ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ గారికి తెలుగు చిత్ర‌సీమ‌లోకి స్వాగతం, తెలుగు ప్రేక్ష‌కులు గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని త‌ప్ప‌క ఆద‌రిస్తారు అని విశ్వసిస్తున్నాను

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మాట్లాడుతూ

లాక్ డౌన్ టైమ్ లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో క‌థ‌లు విన్నాను. అయితే ఈ ఆఫ‌ర్ రాగానే ఎందుకో ఈ ప్రాజెక్ట్ లో న‌టించాలి అనిపించింది. రొమాంటిక్ డ్రామాల్లో నేను న‌టించి చాలా రోజులు అయింది, గుర్తుందా శీతాకాలంతో మ‌రో ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. టాలెంటెడ్ హీరో స‌త్య దేవ్ ఈ సినిమాకు ప‌ర్ ఫెక్ట్, అలానే ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ గారు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అనిపిస్తోంది. చిత్ర‌యూనిట్ అంద‌రికీ నా శుభాబినంద‌న‌లు అని అన్నారు

తారాగ‌ణం

స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియ ద‌ర్శీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్ – నాగశేఖ‌ర్ మూవీస్
స‌మ‌ర్ప‌కులు – ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు
నిర్మాత – నాగశేఖ‌ర్ , భావ‌న ర‌వి
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్ – అనిల్, భాను
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
కొరియోగ్రాఫి – వీజేశేఖ‌ర్
లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సంప‌త్, శివ ఎస్. య‌శోధ‌ర‌
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – న‌వీన్ రెడ్డి
డైలాగ్స్ – ల‌క్ష్మీ భూపాల్
మ్యూజిక్ – కాల‌భైర‌వ‌
ఎడిటిర్ – కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సినిమాటోగ్రాఫ‌ర్ – స‌త్య హెగ్డే
స్టంట్స్ – వెంక‌ట్
స్కీన్ ప్లే, డైరెక్ష‌న్ – నాగ‌శేఖ‌ర్

Eluru Sreenu
P.R.O