రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో రక్షిత్ మీడియా తో ముచ్చటించారు.
‘‘లండన్ బాబులు సినిమా తరువాత ఒక డిఫరెంట్ సినిమా చేయాలని అనుకున్నాను. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కాకుండా ఒక కొత్త నేపథ్యం ఉన్న కథలకోసం చూస్తున్న టైం లో తమ్మారెడ్డి భరద్వాజ గారి ద్వారా ఈ సినిమా కథ నా దగ్గరకు వచ్చింది. మా నాన్నగారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఈ కథ నచ్చడంతో వారి జడ్జిమెంట్ పై నమ్మకంతో ఈ కథ చేయడానికి రెడీ అయ్యాను. నాలుగు వేరియేషన్స్ లో కనపడాలి అన్నప్పడు దాన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నాను. ముందుగా 60 యేళ్ళ వృద్దుడి గెటెప్ ని షూట్ చేయడం జరిగింది పాత్ర కోసం బరువు తగ్గడం పెరగడం వంటివి చేసాను. నాలుగు వేరియేషన్స్ కూడా బాగా కుదిరాయని తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్ వంటి పెద్దలు అనడం ఏప్పటికీ మరిచిపోలేను. ఒక నటుడిగా ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది అని నేను నమ్ముతున్నాను. నాకు ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెడుతోందని భావిస్తున్నాను.
డైరెక్టర్ కరుణ కుమార్ గారు కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ కథ రాసుకున్నారు. డైరెక్టర్ గారు నాకు కథ చెప్పాక ఈ సినిమా కోసం డప్పు కొట్టడం నేర్చుకున్నాను. శ్రీకాకుళం స్లాంగ్ ని ప్రాక్టీస్ చేసాను.. రోజంతా అదే యాసలో మాట్లేడేవాడిని అలా పలాస లో మోహన్రావ్ పాత్ర కోసం నన్ను నేను మలచుకున్నాను. నా తో పాటు మా టీం అంతా లైఫ్ పెట్టి సినిమా చేసారు. 40 రోజులు పలాస లో సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేసాం.. ఇదంతా పక్కా గాజరిగిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో సాధ్యం అయ్యింది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఎక్కవ జాగ్రర్త తీసుకున్నాం అందుకే మా సినిమా కు షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైం ఎక్కవ పట్టింది. సినిమా అనుకున్నప్పటి నుండి ఆయన పలాస గురించి తప్ప మరో ఆలోచన లేకుండా గడిపారు.. షూటింగ్ టైం లో వచ్చిన ఇబ్బందులన్నీ దాటి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే దాకా వచ్చాం అంటే దానికి కారణం మా దర్శకుడు కరుణ కుమార్. ఇప్పుడు స్క్రీన్ మీద నన్ను చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుంటే సంతోషమేసింది.
పలాస ఒక అసురన్ తరహా సినిమా. మళ్లీ నేను ఇంత గొప్ప సినిమాలో నటిస్తానా అనే అనుమానం కలిగింది. ఈ సినిమా చూశాక తమ్మారెడ్డి భరద్వాజ మమ్మల్ని మా యూనిట్ ను మెచ్చుకున్నారు. సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేసి అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క ఫోన్ కాల్ నాలో కాన్ఫిడెన్స్ ని పెంచింది. ఈ సినిమా విషయంలో నిర్మాత, మా తండ్రి గారు ప్రసాద్ గారు చాలా ఆనందంగా ఉన్నారు. కచ్చితంగా ఈ మూవీ ఆడియన్స్ ను అలరిస్తుంది నమ్ముతున్నాను’’ అంటూ ముగించారు.
రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. మార్చ్ 6 న గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.