కాలేజ్ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్

953

ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు హారి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ , దర్శకుడు మలినేని గోపిచంద్, యాక్షన్ హీరో గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింన రాహుల్ః ‘
చ‌ద‌వ‌డం గొప్పా,.. చ‌దివించ‌డం గొప్పా అనే లైన్ ఫాద‌ర్ అండ్ స‌న్ మ‌ద్య వ‌చ్చే కాన్ ప్లిక్ట్ ని ద‌ర్శ‌కుడు బాగా హ్యాండిల్ చేసారు.. ఈసినిమా నా కెరియ‌ర్ లోమెమ‌రబుల్ గా మారుతంది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ నచ్చుతుంది అని న‌మ్ముతున్నాను. రాజేంద్ర ప్రాస‌ద్ గారితో క‌ల‌సి ప‌నిచేయ‌డం నన్ను బెట‌ర్ ఆర్టిస్ట్ ని చేసింది. ఈసినిమా మీకున‌చ్చితే అందులో ఎక్కువ క్రెడిట్ రాంజేంద్ర ప్రాస‌ద్ గారికే చెందుతుంది.’అన్నారు.

నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ:
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అని ఈ ఈవెంట్ మరోసారి ప్రూవ్ చేసింది స్టార్టింగ్ డేస్ తమకు విజయ్ మాస్టర్ ఎలా సాయం చేసాడో రామ్ లక్ష్మణ్ లు చెప్పారు.. గోపీచంద్ తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ హీరో గా నిలబడాలని అతని కోసం ఇక్కడికి వచ్చాడు.. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరయినా నన్ను ఇంత ఎనర్జీ గా ఎలా ఉండగలుగుతున్నావు అంటే నేను వారికి ఇచ్చే సమాధానం నాకు ఇంకా పని దొరకడమే అంటాను.. ఏ ఆర్టిస్ట్ అయినా నటిస్తున్నంత కాలం చాలా సంతోషంగా ఉంటాడు.. అదే అతని ఎనర్జీ.. ఇన్ని సంవత్సరాలు నేను మీకు ఎంటర్ట్ టైన్మెంట్ అందిస్తున్నానంటే అది నా పూర్వ జన్మ సుకృతం.’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు హరి మాట్లాడుతూః
‘మంచి సినిమా తెలుగు, త‌మిళ్ లో చేయ‌డానికి న‌న్ను ఎంచుకున్నందుకు నిర్మాత‌కు థ్యాంక్స్.. మాస్ట‌ర్ నన్ను న‌మ్మి రాహుల్ ని చెప్పారు.. మంచి క‌థ  ఉంటే  ఏ లాంగ్వేజ్ లో అయినా క‌థ చెప్ప‌వ‌చ్చు అని న‌మ్ముతాను.. ఒక సెట్ అసిస్టెంట్ కొడుకుగా జ‌ర్నీ మొద‌లు పెట్టి ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చాను అంటే ఈ ప్ర‌యాణం లో నాకు  స‌పోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్. ఈ క‌థ కు లాంగ్వేజ్ బారియ‌ర్స్ ఉండ‌వు.. ఒక యూనివ‌ర్స‌ల్ పాయింట్ క‌నిపిస్తుంది..మీ ఆశిస్సులు కావాలి’ అన్నారు.