‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, గేమ్ ఓవర్స లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో మంచి స్ధానం సంపాయించిన ‘వై నాట్’ స్థూడియోస్ నిర్మాణం లో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వున్న హీరో ధనుష్ హీరోగా. పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు), పేట సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డి40(ధనుష్-40) ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సివాలా, ప్రతిరోజుపండగే లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాణ సంస్థలు జిఏ2 పిక్చర్, యువి క్రియెషన్స్ ఇప్పడు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. నిర్మాణ విలువలు మినిమమ్ గ్యారెంటి సబ్జక్ట్స్ తో అత్యధిక సక్సస్ రేట్ తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధలు ఈ చిత్రాన్ని విడుదల చేయటమే డి40 కున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. ఈ చిత్రం యెక్క మెదటి లుక్, టీజర్ వివరాలు త్వరలో తెలియజేస్తారు.