విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల నిర్మాణమే మా సంస్థ ఆశ‌యం — Elite Entertainments

209

Elite Entertainments పతాకం పై Elite Group నిర్మాణంలో ‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సీవాలా భామ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో ఇటీవలే ముహూర్తం కార్యక్రామాన్ని జరుపుకుని షూటింగ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే Elite Developers, Elite Restaurants లాంటి పలు రంగాల్లో పేరు కాంచిన ఈ సంస్థ ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి తమ మొదటి అడుగు వేయనుండడంతో ‘ Elite Entertainments’ బ్యానర్ ఓపెనింగ్ కార్యక్రామాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇదే కార్యక్రమంలో పటాన్ చెరువు MLA గూడెం మహిపాల్ రెడ్డి, వరంగల్ వెస్ట్ MLA దాష్యం వినయ్ భాస్కర్ రెడ్డి గార్ల చేతుల మీదుగా వీరి నుంచి రానున్న కొత్త వెంచర్ Elite Trendz ని లాంచ్ చేయడం జరిగింది. ” మేము ఇప్పటివరకు చేసిన అన్ని రంగాల్లో నాణ్యతను కాపాడుకుంటూ ఎదిగాం, అలాగే సినీ రంగంలో కూడా ఆ నాణ్యతను వంద శాతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. యంగ్ టాలెంట్, మంచి కథలకి ఎల్లప్పుడూ మా నిర్మాణ సంస్థ అందుబాటులో ఉంటుంది” అని చైర్మన్ ప్రమోద్, మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన క్రికెటర్ వెంకటపతి రాజు గారి చేతుల మీదుగా వీరిచే ఇటీవలే నిర్వహించబడిన Elite Premier League విన్నర్స్ కి ట్రోఫీలు ఇవ్వడం జరిగింది.

” రెండవ సినిమా Elite Entertainments బ్యానర్ లో చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఈ నెల చివరలో షూటింగ్ మొదలు పెడ్తున్నాం” అని కిరణ్ వ్యాఖ్యానించగా ” టాక్సీవాలా తర్వాత సంవత్సరం గ్యాప్ తీస్కుని కథ, క్యారక్టర్ చాలా బాగా నచ్చడంతో వెంటనే ఇది నేను చేసెయ్యాలి అని ఫిక్స్ అయ్యా” అని హీరోయిన్ ప్రియాంక చెప్పింది.
ఈ కార్యక్రమంలో పార్ట్నర్స్ సిద్దారెడ్డి, విశ్వనాధ్ మరియు శంకర్ గార్లు పాల్గొన్నారు.