విజయవంతమైన మా చిత్రాన్ని చిన్న చూపు చూడకండి – దర్శకుడు సురేష్

669


రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి హీరో హీరోయిన్లుగా రాజారెడ్డి బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని థియేటర్స్ లో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ…
ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల్లో ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన అనుభవించు రాజా చిత్రానికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన ప్రేక్షకుల నుండి లభించడం ఆనందంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక అనుకోని దృరుద్రుష్ట కరమైన సంఘటన జరిగింది. నిన్న (శనివారం) సాంతంత్రం బుక్ మై షో వారు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనను 70 నుండి 80 శాతం ఉందన్న మెసేజ్ ను మాకు పంపారు, అదే రాత్రి 11.30 నిమిషాలకు శుక్రవారమే విడుదలైన మరో చిత్రానికి 70 శాతం ప్రేక్షకుల స్పందన లభించిందని బుక్ మై షో లో పెట్టారు. మా చిత్రానికి వచ్చిన స్పందన 20 శాతంగా ఉందని వారు పేర్కొనడం చిత్ర దర్శకుడిగా ఒక వైపు కోపం, మరోవైపు బాధ కలిగింది. ఆదివారం ఉదయం బుక్ మై షో వారిని సంప్రదించగా తప్పు ఎవరి మూలానో జరిగిందో తెలిలేదని, 24 గంటల వ్యవధి కోరారు. దీనివల్ల నర్శిపట్నం లాంటి చిన్న సెంటర్స్ లో కూడా విజయవంతంగా ఫుల్ అవుతున్న మా చిత్ర భవిషత్యు ఏమవుతుందోనని ఆందోళలనో ఉన్నాము. చిత్రం చూసిన వారందరు బాగుందని ప్రశంసలు లభిస్తున్నాయి అన్నారు.

నటుడు షాని మాట్లాడుతూ…
ఈ సినిమా కోసం 300 మందిని హీరో వేషం కోసం ఆడిషన్స్ పెట్టారు. అందులో నుండి రవితేజను సెలెక్ట్ చేశారు. చిత్రం విడుదల అయ్యాక హీరోకు మంచి గుర్తింపు లభిస్తోంది. నటుడిగా ఈ సినిమా నాకు మంచి టర్నిక్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరో రవితేజ మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో మా సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం సంతోషంగా ఉంది, మాకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న హీరోయిన్స్ శ్రావణి నిక్కీ, శృతి శెట్టి చిత్ర విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.