యోగేశ్వర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పరారి’. ”రన్ ఫర్ ఫన్” అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి శివాజీ దర్శకుడు. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మిస్తున్నారు. రాజకీయ నాయకుడి గా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి గా కొనసాగుతున్న గిరి ఈ సినిమా తో నిర్మాత గా మారి ఒక ఎంటర్ టైనర్ ని అందిస్తున్నారు. హీరో సుమన్ ముఖ్య అతిథిగా పరారి ఆడియో లాంచ్ కి హాజరయ్యారు.
రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో పరారి ఆడియో లాంచ్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా
రాజ్ కందుకూరి మాట్లాడుతూ : ” యోగీశ్వర్ డాన్స్ బాగుంది. సాంగ్స్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. చక్రి ని
మహిత్ గుర్తు చేసాడు. మహిత్ వర్క్ చాలా అద్భుతంగా గా ఉంది. నేను ఈ ఫంక్షన్ కి రావడానికి చక్రి గారు ఒక కారణం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ : “చిన్న సినిమా అని ఎక్కడా అనుకోవడానికి లేకుండా ఈ సినిమా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని తెలుస్తుంది. యోగీశ్వర్ పేరులోనే పవర్ ఉంది. నిర్మాత గిరి గారు పెర్మినెంట్ ప్రొడ్యూసర్ అవుతారు అనిపిస్తుంది. ” అన్నారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ : ” మూడు జనరేషన్స్ ఇలా వేదిక మీద చూడటం హ్యాపీ గా ఉంది. ప్రొడ్యూసర్ గిరి తన తనయుడు ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. గిరి గారి నాన్న గారు ఈ వేడుక లో భాగం అవ్వడం ,ఈ మూడు జనరేషన్ లను చూడటం హ్యాపీ గా ఉంది. యోగీశ్వర్ కి చాలా మంచి భవిష్యత్తు ఉంది” అన్నారు.
నటుడు శ్రవణ్ మాట్లాడుతూ : ” గిరి గారు నాకు ఫ్యామిలీ మెంబెర్ లాంటి వారు. నన్ను ఫైనాన్షియల్ గా గైడ్ చేసేవారు. సినిమా తీస్తున్నారు అనగానే మొదట నేను అంత గా ఇష్ట పడలేదు. కానీ యోగీశ్వర్ టాలెంట్ ఏంటో సెట్స్ లో తెలుసింది. నా పాత్ర చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఈ సినిమా ఔట్ పుట్ చూసాక చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కు పడింతలు డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.
ముఖ్య అతిథిగా వచ్చిన హీరో సుమన్ గారు మాట్లాడుతూ : ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. గిరి నాకు అభిమని మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబెర్. నా సక్సెస్ లొనే కాదు , ప్రతి సందర్భం లోనూ గిరి నాతో ఉన్నాడు. అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం.
దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ : ఈ కథ వెనుక మూడేళ్ల కష్టం ఉంది. ఈ కథ ను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నా కథ కు బెస్ట్ సపోర్ట్ నిచ్చారు. ఒక పెద్ద టెక్నికల్ టీం తో వర్క్ చేయడం న అదృష్టం. మహిత్ గారి మ్యూజిక్ ఆయన ఇచ్చిన సపోర్ట్ పరారి కి పెద్ద సపోర్ట్ గా నిలిచింది. నిర్మాత గిరి గారు బెస్ట్ ప్రొడ్యూసర్ గా నిలుస్తారు ” అన్నారు.
హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ : ” నేను హీరో గా ట్రయ్ చేయడానికి కారణం హీరో గా మారడానికి మా నాన్న గారే కారణం. హీరో సుమన్ గారి తో స్క్రీన్ షేర్ చేసుకుంటాంనని అనుకోలేదు. అది నా అదృష్టం. మా డిఓపి అంజి గారు, ఫైట్ మాస్టర్ నందు గారు ఇచ్చిన సపోర్ట్ సూపర్బ్. మంచి ఎంటర్టైనర్ ని అందించబోతున్నాం , నేను హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ కోసం చాలా మంది మా వెనకాల నిలబడ్డ అందరికీ థాంక్స్ ” అన్నారు.
నిర్మాత గిరి మాట్లాడుతూ : ” ఈ సినిమా ని ఎక్కడా లెక్కలు వేసుకొని నిర్మించలేదు. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని అందించాం. సుమన్ గారు నా అభిమాన హీరో, కానీ ఈ సినిమా చూసాక నా కొడుకు కు ఫ్యాన్ అయ్యాను. ఏదో చేస్తాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. చాలా సర్ప్రైజ్ అయ్యాను. చక్రి గారి తో నాకు మంచి రిలేషన్ ఉంది. చక్రి కోసమే మహిత్ కి అవకాశం ఇచ్చాను. నా నమ్మకం నిల బెట్టారు. సినిమా విషయంలో చాలా సంతృప్తి గా ఉన్నాము” అన్నారు.
‘పరారి’ చిత్రంలో యోగేశ్వర్, అతిథి, సుమన్, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రావణ్, మకర్‌దేశ్ పాండే, జీవా, కల్పలత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గురుదేవగా అంజి, ఎడిటర్: గౌతమ్ రాజు, కొరియోగ్రఫి: జానీ, భాను, ఫైట్స్: నందు, సమర్పణ: గాలి ప్రత్యూష, నిర్మాత: జీవివి. గిరి, దర్శకత్వం: సాయి శివాజీ.