ఆర్.కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీనటి రోజా జన్మదిన వేడుకలు

917

ఆర్.కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళారులను గౌరవిస్తూ కళాకారులకు నాట్యనీరాజనాలు శీర్షికలో భాగంగా సినీనటి, నగరి శాసనసభసభ్యురాలు అయిన ఆర్.కె రోజా గారి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ చైర్మన్ డా.రంజిత్ మాట్లాడుతూ.. .“రోజాగారు జన్మించిన భాకరపేట సమీపం లో గల దేవరకొండ మా ఊరు, ఆమె నటిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు, మా ప్రాంతపు వాసులకు రోజా గారు ఆదర్శం. ఆ ఇన్స్పిరేషన్ తోనే నేను సినిమా రంగానికి వచ్చి దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలు తీశాను . రోజా గారు ఇలాంటి పుట్టినరోజు లు ఇంకా ఎన్నో జరుపుకోవాలని,ఇటు సినిమా రంగం,అటు రాజకీయ రంగంలో రాణించాలని కోరుకుంటున్నా. భారతీయ సంస్కృతి ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మా ఫౌండేషన్ స్థాపించామనీ తెలిపారు. ఇక
ఉదయం 9 నుండి కూచిపూడి, భరతనాట్యం, పెరిణి, ఆంధ్రనాట్యం ,కథక్, మోహిని అట్టం, ఒడిసి మొదలగు నాట్య ప్రదర్శన లు మరియు ఇతర కళలు, ఆంధ్ర, తమిళనాడు ,తెలంగాణ, కర్నాటక ప్రాంతాల చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని డా.రంజిత్ తెలిపారు,
ముఖ్య అతిధిగా విచ్చేసిన నగరి శాసనసభ సభ్యులు శ్రీమతి ఆర్.కె రోజా గారు మాట్లాడుతూ …“నా పుట్టిన రోజును గుర్తుంచుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న డా.రంజిత్ కుమార్ ని అభినందనలు. కనుమరుగవుతున్న కళలు భావితరాలకు అందించాలని చేస్తున్న సంస్థ ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యాలని, ఇంకా ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించాలని చెబుతూ … అనేక ప్రాంతాల నుండి విచ్చేసి నాట్య ప్రదర్శన లు ఇచ్చిన చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, సతీష్, చంద్రశేఖర్, మోహన్, రామనరసయ్య,ఏకాంబరం,కేశవ, నాట్యగురువు అంజు, శ్రీదేవి, కళాకారులు పెద్దలు పాల్గొన్నారు