‘ఆర్‌ఎక్స్100′ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం ’90 ఎం.ఎల్’. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ ఎక్స్100’ తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి ఇందులో కథానాయిక.
ఈ చిత్రం విశేషాలను
నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ వివరిస్తూ ”టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవలే మూడు పాటలను అజర్ బైజాన్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని చెప్పారు.
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ”అజర్ బైజాన్ రాజధాని బాకులోని బ్యూటీఫుల్ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర ‘8’ రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో హీరోయిన్‌పై ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే’ అనే ఎమోషనల్ గీతాన్ని చిత్రీకరించాం. ‘సింగిల్ సింగిల్’ అనే పాటను ఫుల్ డ్యాన్స్ నెంబర్‌గా హీరో, హీరోయిన్, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. ‘నాతో నువ్వుంటే చాలు’ అనే డ్యూయట్‌ని హీరో – హీరోయిన్, 10 మంది డ్యాన్సర్లపై షూట్ చేశాం. ఈ ‘3’ పాటలకూ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయి” అని తెలిపారు.
నటీనటులు:
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ ,పోసాని కృష్ణ మురళి,
అజయ్ , ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు .
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: జీఎం శేఖర్, పాటలు: చంద్రబోస్, ఫైట్స్: వెంకట్, జాషువా, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ, రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర .