HomeTeluguయంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించిన ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించిన ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్


సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బుధవారం తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ‘కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోగా పరిచయం అవుతున్న శ్రీసింహాకు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కాలభైరవ (ఎమ్.ఎమ్.కీరవాణి పెద్ద కుమారుడు)కు, అలాగే చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘మత్తు వదలరా’ చిత్ర ఫస్ట్ లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్‌లో హైలెట్ చేసినవి చూస్తుంటే ఈ చిత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. అందరూ కొత్తవాళ్లతో రూపొందుతున్న ఈ చిత్రంతో హీరోగా శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవ, డైరెక్టర్‌గా రితేష్ రానా, సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ సారంగం, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ.. “మత్తు వదలరా చిత్రం హాస్యంతో నిండిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. దర్శకుడు రితేష్ రానా చివరి వరకు ఆసక్తికరమైన కథనంతో సాగే మంచి కథను తయారుచేశారు. కంటెంట్ అద్భుతంగా ఉంది కాబట్టి, అలాగే యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో మేమే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రంతో కొత్తవారినెందరినో టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే చిత్ర టీజర్‌ను విడుదల చేస్తాము..’’ అన్నారు.
శ్రీసింహా, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ, దర్శకత్వం: రితేష్ రానా,
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్,
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత,
సంగీతం: కాలభైరవ,
డి.ఓ.పి: సురేష్ సారంగం,
ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్. ప్రకాశ్,
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్,
స్టంట్ కో-ఆర్డినేటర్: శంకర్ ఉయ్యాల,
క్రియేటివ్ హెడ్: థోమస్ జై,
కో-రైటర్: తేజ.ఆర్,
లిరిక్స్: రాకేందుమౌళి,
కొరియోగ్రాఫర్: యశ్వంత్,
స్టయిలింగ్: తేజ.ఆర్,
లైన్ ప్రొడ్యూసర్: పి.టి. గిరిధర్ రావు,
పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్జ్,
పి.ఆర్.ఓ: మధు మడూరి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES