*ఎవరివే ప్రేమ హృదయమా అనే పాటను సిద్ శ్రీరామ్,, సునీత ఆలపించారు*
బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా *ఐపీఎల్*. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ ఆవిష్కరించారు. వెంగి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను ప్రముఖ గాయకులు సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా దర్శకులు వి వి వినాయక్ మాట్లాడుతూ..సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన ఈ పాట చాలా బాగుంది.సంగీత దర్శకుడు వెంగీ సంగీతం బాగుంది.చిత్ర దర్శకుడు సురేష్ , నిర్మాత బీరం శ్రీనివాస్ చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ అన్నారు
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ: మా ఐపిఎల్ సినిమా మొదటి సాంగ్ వినాయక్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషం వుంది. ఇందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ వున్నారు. సీనియర్ నటి నటులు నటించారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ; డైరెక్టర్ వినాయక్ గారికి ధన్యవాదములు.సబ్జెక్ట్ బాగుంది. ఈ ప్రాజెక్ట్ యాక్ట్ చేయడం చాలా హ్యాపీ గా వుంది. దర్శకులు సురేష్ ఎంతో డెడికేటెడ్ తో తెరలెక్కించారు. నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాము అన్నారు.
నిర్మాత బీరం శ్రీనివాస్ మాట్లాడుతూ: ఈరొజు మా మూవీ లోని పాటను డైనమిక్ డైరెక్టర్ వి వి వినాయక్ రిలీజ్ చెయ్యడం మాకు ఎంతో ఆనందంగా వుంది. సిద్ శ్రీరామ్ సునీత గారు ఆలపించిన లిరికల్ సాంగ్ చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. మా ఐపిఎల్ టీమ్ ను ఆశీర్వదించిన వినాయక్ గారికి ధన్యవాదాలు. సంగీత దర్శకుడు వెంగి అద్భుతమైన బాణీలను సమకూర్చారు. పాటలు అన్నీ బాగా వచ్చాయి.సిద్ శ్రీరామ్ సునీత గారు పాడిన ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ సినిమా క్రికెట్ బెట్టింగ్స్ నేపథ్యంలో యువత లైఫ్ ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే కథాంశంతో తెరకెక్కుతుంది. తనికెళ్ళ భరణి, పోసాని, సుమన్ రచ్చారవి మంచి క్యారెక్టర్స్ చేశారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాంఅని అన్నారు.
.చిత్ర సంగీత దర్శకుడు వెంగి మాట్లాడుతూ: సిద్ శ్రీరామ్ సునీత గారు ఆలపించిన ఎవరివే ప్రేమ హృదయమా పాటను రిలీజ్ చేసి మాటిం ను బ్లెస్ చేసిన ప్రముఖ దర్శకులు వినాయక్ గారికి కృతజ్ఞతలు. పాటలు అన్నీ బాగా వచ్చాయి.నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేష్ నిర్మాత బీరం శ్రీనివాస్ గార్లకు కు థాంక్స్ అన్నారు.
తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి,సుమన్,డిఎస్ రావు,చైతన్య,ఈరోజుల్లో సాయి, రచ్చ రవి, రామ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంగి, సినిమాటోగ్రఫీ: AK ఆనంద్, ఎడిటర్: జానకి రామ్, ఆర్ట్: వెంకట్, యాక్షన్: సతీష్, కాస్ట్యూమ్స్: ఆనంద్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామాంజనేయులు, కో డైరెక్టర్; తిరుమల కుమార్, నిర్మాత: బీరం శ్రీనివాస్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సురేష్ లంకలపల్లి.