*మంత్రి తలసాని క్లాప్ తో మిస్సమ్మ చిత్రం ప్రారంభం*

645

శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ హరి ఐనీడి, రమ్య కొమ్మాలపాటి నిర్మాతలుగా భారీ బడ్జెట్ అండ్ సాహసంతో కూడుకున్న ప్రయత్నమే అయినప్పటికీ సినిమాపైన ఇష్టంతో, ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిరాజ్ రుపాల, సతీష్ V. M అనే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ మిస్సమ్మ అనే చిత్రంతో పరిచయం అవుతున్నారు. మిస్సమ్మ చిత్ర ప్రారంభోత్సవం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటి వద్ద హీరో హీరోయిన్ల ఫై క్లాప్ కొట్టి ఘనంగా ప్రారంభించారు. టీం అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తలసాని. ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మిస్సమ్మ హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. తన సన్నిహితుడు హరి అయినీడి సినిమా పరిశ్రమలో చాలా కష్టపడ్డాడు, పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశారు, ఫ్యాషన్ ఉన్న నిర్మాత, మంచి వ్యక్తి. అలాంటి హరి అయినీడి కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని తలసాని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ఆరా మస్తాన్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా.. సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.
సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్, లైవ్లీ అండ్ లవ్లీ బిహేవియర్ తో అలనాటి మిస్సమ్మ ఆల్ టైం క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుని సరికొత్త కథ, కథనాలతో చేస్తున్న ప్రయత్నం ఈ మిస్సమ్మ. సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతోంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మిస్సమ్మ . బ్రిటీషర్స్ రాక ముందు ఇండియన్ హిస్టరీ నుంచీ, బ్రిటిషర్స్ రిజైమ్ నుంచీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుని, ఆ విషయాలను ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం ఈ మిస్సమ్మ.

*దర్శకులు మాట్లాడుతూ* .. మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సినిమా ప్రారంభించటం చాలా ఆనదంగా వుంది. ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ కు నచ్చే విధంగా రూపొందిస్తున్నాం. నన్ను కథను నమ్మి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు తెలిపారు.

*హీరోయిన్ శోభిత రానా* మారట్లాడుతూ.. ఇంత మంచి ప్రాజెక్టు లో నేను చెయ్యటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది. నాకు మరియు చిత్ర యూనిట్ కు మంచి పేరు తెచ్చే సినిమా ఇది అన్నారు.

*బిగ్ బాస్ లహరి మాట్లాడుతూ* .. మిస్సమ్మ సినిమాలో నేను కూడా చెయ్యటం చాలా ఆనందం గా వుంది అన్నారు.

*హీరో అర్జున్ కృష్ణ మాట్లాడుతూ* .. నాకు నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా మిస్సమ్మ అవుతుంది. ఈ సినిమా తరువాత హీరోగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను రుణపడి వుంటాను అని అన్నారు.

*నటి నటులు:* శోభిత రానా హీరోయిన్ గా, అర్జున్ కృష్ణ బొల్లిపల్లి హీరోగా నటిస్తున్నారు. శివ కాటంనేని, D Sరావు , D M జాన్సన్ విలన్ గా, అమృతం అప్పాజీ మరియు బిగ్ బాస్ లహరి, పింగ్ పాంగ్ సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు: కథ : V.M సతీష్, కథనం, మాటలు – హను రావూరి. ఛాయ గ్రహణం- డేవిడ్ మార్గెల్, కో- డైరెక్టర్ -రవి కిశోర్ చందిన, ఆర్ట్ డైరెక్టర్- S V మురళి, PRO – సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, కాస్ట్యూమ్స్ – అశ్వంత్ బైరి, మేనేజర్- రాజేష్ రడం, తదితరులు పనిచేస్తున్నారు.